
రాజోలు, (జనస్వరం) : కొన్ని రోజుల క్రితం ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా రాజోలు మండల పరిధిలో గల చింతలపల్లి గ్రామంలో పూరి గుడిసె పాడైపోయింది. నిస్సహాయంగా ఎదురు చూస్తున్న సేనాపతి కావయమ్మ ఇంటి పై కప్పును రాజోలు వైస్ MPP ఇంటిపల్లి ఆనంద రాజు ఆధ్వర్యంలో గణసాల రామరాజు ఆర్థిక సహాయంతో ఇంటి కప్పు పై బరకం కప్పి నిత్యవసర సరుకులు ఇచ్చి ఆ అవ్వకు అండగా నిలిచారు. ఆపన్నులను ఆదుకోవటమే జనసేన పార్టీ ధ్యేయమని వైస్ ఎంపీపీ ఆనందరాజు జనసైనికుల సేవల పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో చింతలపల్లి గ్రామ జన సైనికులు పిప్పల లక్ష్మణరావు, లంకలపల్లి రమేష్, గనశాల బాలాజీ, జనసైనికులు గ్రామస్తులు పాల్గొన్నారు.