Logo
Date of Publish : 04 September 2023, 11:44 pm
Editor : Sake Naresh

వర్షాకాలం వచ్చేసింది, బొబ్బిలి గ్రంథాలయం పైకప్పు కన్నాలైనా మూయించండి 

     బొబ్బిలి ( జనస్వరం ) : గ్రంథాలయం మరమ్మత్తులు మరియు మౌలిక సదుపాయాల గురించి జనసేన పార్టీ ప్రశ్నిస్తే, వారం రోజుల్లో పూర్తి చేసేస్తున్నామని చెప్పిన అధికార పార్టీ, నేటికి ఇన్ని నెలలు గడుస్తున్నా ఎందుకు జాప్యం జరుగుతుందో తక్షణమే సమాధానం చెప్పాలని బాబు పాలూరి అన్నారు. నిధులు మంజూరయ్యి సుమారు రెండవ సంవత్సరం కూడా దాటిపోతున్నా ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారో అర్థం కావడం లేదని, ప్రస్తుతం వర్షాల వలన గ్రంథాలయం పైకప్పు కున్న కన్నాల వలన గ్రంథాలయం మొత్తం తడచి ముద్దైపోతుందని వాపోయారు. కనీసం మహిళలకైనా టాయిలెట్ సదుపాయం లేదని, బోర్వెల్ కూడా పాడైందని, కూర్చోవడానికి సరిపడా కుర్చీలు టేబుల్స్ కూడా లేవని అన్నారు. బుక్స్ కూడా అవసరమైనవి లేవని విద్యార్థులు ఇన్ని సార్లు మొత్తుకుంటున్నా ఎందుకు ప్రభుత్వంలో చలనం రావడంలేదని జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి బాబు పాలూరు గారు ప్రశ్నించారు. తక్షణమే MLA శంబంగి చినప్పలనాయుడు గారు ఈ విషయంపై స్పందించి మరమ్మత్తులు జరిపించి కావలసిన కనీస మౌలిక సదుపాయాలు ఏర్పాటు చెయ్యాలని డిమాండ్ చేసారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com