విజయనగరం ( జనస్వరం ) : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వారోత్సవాలు విజయనగరంలో జనసేన పార్టీ మరియు విజయనగరం జిల్లా చిరంజీవి యువత సంయుక్త ఆధ్వర్యంలో శనివారం ఉదయం పార్టీ సీనియర్ నాయకులు, జిల్లా చిరంజీవి యువత అధ్యక్షులు త్యాడ రామకృష్ణారావు(బాలు) ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా కాంటోన్మెంట్ గణేష్ కోవెల రోడ్డు, ముస్లీమ్ వీధుల్లో కాలువలు శుభ్రపరచి, కాలువల్లో బ్లీచింగ్ చల్లారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా హాజరైన జనసేన పార్టీ సీనియర్ నాయకులు ఆదాడ మోహనరావు హాజరై, ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వారోత్సవాల్లో భాగంగా పారిశుధ్య కార్యక్రమం చేయడం, నిద్రపోతున్న విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ అధికారులను తట్టిలేపడమేనని, కాలువల్లో పేరుకుపోయిన చెత్తను తీయట్లేదని,బ్లీచింగ్ వేయట్లేదని,కాలువల్లో పందులు గుంపులుగుంపులుగా సంచరిస్తున్నాయని, చెత్త పన్ను కట్టకపోతే చెత్తను ఇంట్లో వేస్తూ దిగజారిన అధికారులు, వీధుల్లోను, కాలువల్లో ఉన్న పందులను, కుక్కలను అధికారుల ఇళ్లల్లో కట్టాలి అని మండిపడ్డారు. ఇకనైనా మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కలెక్టరేట్ కూతవేటు దూరంలో ఉన్న ప్రాంతంతో పాటు నగరమంతా ప్రజలకు రోగాల బారినపడకుండా కాలువలు శుభ్రపరచి ఈ విజయనగరాన్ని ఆరోగ్యనగరంగా తీర్చిదిద్దాలాని కోరారు. కార్యక్రమంలో అంజనీపుత్ర చిరంజీవి ప్రజాసేవసంఘం అధ్యక్షులు కొయ్యాన లక్ష్మణ్ యాదవ్, జిల్లా చిరంజీవి యువత కార్యదర్శి, జనసేన నాయకులు పిడుగు సతీష్, జనసేన పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ ఎస్. మురళీమోహన్,ఆర్గనైజింగ్ కార్యదర్శి శీర కుమార్,నాయకులు పత్రి సాయికుమార్,అప్పన్న, సూరిబాబు,ఎర్రబాబు, రాజు, రాజేష్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com