ఆళ్ళగడ్డ ( జనస్వరం ) : ఆళ్ళగడ్డ పట్టణంలో ఎమ్మార్వో ఆఫీస్ నందు ఐదవ రోజు జరుగుతున్న అంగన్వాడి టీచర్ల నిరవధిక సమ్మెకు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఆళ్ళగడ్డ నియోజకవర్గం జనసేన నాయకులు ఇరిగేల రాంపుల్లారెడ్డి, ఆళ్ళగడ్డ నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త మైలేరి మల్లయ్య, ఇరిగేల సూర్యనారాయణ రెడ్డి, ఇరిగేలా విశ్వనాథరెడ్డి అంగన్వాడి టీచర్ల, ఆయాల నిరవధిక సమ్మెకు సంపూర్ణ మద్దతు తెలిపారు. అనంతరం ఇరిగేల రాంపుల్లారెడ్డి, మైలేరి మల్లయ్య మీడియాతో మాట్లాడుతూ
రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడి కార్యకర్తల న్యాయమైన డిమాండ్లను తక్షణమే పరిష్కారించాలని కోరారు. ఈ రాష్ట్రంలో పసి పిల్లల దగ్గర నుండి పండు ముసలి వాళ్ళ నోరు దగ్గర అన్నమును లాక్కొని వెళ్లే వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని తెలియజేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాదయాత్రలో పక్క రాష్ట్రాల కంటే వెయ్యి రూపాయలు ఎక్కువ ఇస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత పక్క రాష్ట్రాల్లో ఇస్తున్నటువంటి వేతనాల కంటే తక్కువ ఇవ్వటాన్ని మాట ఇచ్చి మడమ చెప్పడం కాదని ప్రశ్నించారు. అంగన్వాడి టీచర్ల సమస్యలు పరిష్కారం అయ్యేవరకు వారి దీక్షలకు ఆళ్ళగడ్డ జనసేన పార్టీ తరఫున మద్దతుగా ఉంటామని తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి జీతాలు సరిపోక సొంత డబ్బులు ఖర్చు పెట్టి పనిచేస్తున్నారని, రాష్ట్రవ్యాప్తంగా వాడి టీచర్లు హెల్పర్లు 1,20,000 మంది ఉన్నారని వారందరి ఉసురు జగన్మోహన్ రెడ్డి గారికి తగులుతుందని సూచించారు. 2019లో జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉండి పాదయాత్ర చేస్తూ అంగన్వాడి వర్కర్లకు ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలి లేని పక్షంలో జనసేన పార్టీ తరఫున ఈ ఉద్యమం తీవ్రస్థాయిలో జరుగుతుందని, రాబోవు 2024 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన, టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది మీ డిమాండ్లన్నీ పరిష్కరించే విధంగా కృషి చేస్తాం అని అంగన్వాడి వర్కర్స్, హెల్పర్స్ యూనియన్లకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పెసరాయి చాంద్ భాషా, సజ్జల నాగేంద్ర, మహబూబ్ దౌల, మాబుహుస్సేన్, రామకృష్ణ, బాలయ్య, బాబు తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com