విజయవాడ ( జనస్వరం ) : ఇంటింటికి రాబోయే జనసేన ప్రభుత్వం రెండో విడతలో భాగంగా 58 వ రోజు 48 వ డివిజన్ అధ్యక్షులు కొరగంజి వెంకటరమణ ఆధ్వర్యంలో ఆంజనేయ ఆంజనేయవాగు బయట నుంచి ప్రారంభించి కొండ ప్రాంతంలో పర్యటిస్తూ ప్రజలను కలుస్తూ సమస్యలను అడిగి తెలుసుకున్న జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి పోతిన వెంకట మహేష్. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ ప్రత్యేకంగా వడ్డెర సామాజిక వర్గం, భవన నిర్మాణ కార్మికులను కలసి కరపత్రాలు పంపిణీ చేస్తూ ప్రచారం చేయడం జరిగింది. ప్రతీ ఒక్కరూ కూడా ఒకీటే మాట్లాడుతున్నారు. మహేష్ గారు గతంలో ఇసుక లభ్యమయ్యేది, వారం రోజులు పని దొరికేది, కానీ 4 సంవత్సరాలనుండి కేవలం వారానికి రెండు రోజులు, మూడు రోజులు మాత్రమే పని దొరుకుతుందని. నాలుగో రోజు పని దొరికింది అంటే ఆ రోజు మాకు పండగే అని అంటున్నారని. ఈ పరిస్తితి ఎందుకు వచ్చింది అంటే, వాళ్లంతా ఒకటే మాట చెబుతున్నారు. ఇసుక దొరకక పోవడం వల్ల మరమ్మత్తు లు కూడా చేయించు కోవడం లేదని, అందువలన పనులు దొరకడం లేద ని పనులు దొరకక పోవడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాము అని ఆవేదన వ్యక్తంచేశారని. ఈ ప్రభుత్వం మారాలి, ఇసుక పాలసీ మారాలి, మా అందరికీ పనులు దొరకాలి. పదకాలు కాదు మాకు కావలసినది, పని కావాలి అని ఆవేదన వ్యక్తంచేశారని మా రెక్కల కష్టం మీద మేము బతుకుతున్నాం గానీ పదకాల మీద కాదని, ఈ పదకాలు ఉంటే ఎంత, పోతే ఎంత మాకు పని కావాలి అని స్పష్టంగా తెలియ జేశారని. వీటితో పాటు మద్యం ధరలు విపరీతంగా పెరిగి పోవడం వలన మా భర్తలు ఉన్న డబ్బంతా వైన్ షాప్ లలోనే జగన్మోహన్ రెడ్డి గారికి కట్టేస్తున్నారని. ఆ మందు తాగి వచ్చి ఇళ్ళల్లో గొడవలు చేస్తున్నారని. మా కష్టాన్ని దోచుకునే దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి ని అంటున్నారని. ఇంటి పట్టాలు ఇచ్చారని, అవి ఎందుకు పనికిరావు అని అంటున్నారని. పెన్షన్ దారులు కు ఏక్సిడెంట్ అయితే ఆసుపత్రికి వెళ్తే మీకు ఆరోగ్య శ్రీ రాదని చెప్పడం తో ఇళ్లలోనే మగ్గి పోతున్నారని. రాబోయే రోజుల్లో మేమంతా తిరుగుబాటు చేసి వైసీపీ నీ ఓడించి పలుగు, పార లతో తవ్వి, పొడిచి, పొడిచి కృష్ణా నదిలో కలిపి పారేస్తాము అని అంటున్నారని అన్నారు.
పశ్చిమ నియోజక వర్గంలో అభివృద్ధి గురించి మాట్లాడుతున్న వెల్లంపల్లి కొండ ప్రాంతాల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నీ ఎందుకు వినియోగం లోకి తీసుకు రాలేక పోయారని సమాధానం చెప్పాలని. కొండ పైప్రాంతాల్లో పారిశుధ్యం ఎందుకు అధ్వాన్నంగా వుంది, మెట్ల మార్గం ఎందుకు బాగు చేయడం లేదు, రిటైనింగ్ వాల్ ఎందుకు నిర్మాణం చేయడం లేదని. దీనికి మీరు సమాధానం చెప్పాలని. పశ్చిమ నియోజక వర్గంలో 4,5 డివిజన్ లలో గంజాయి వాడకం ఎక్కువగా ఉందని. గంజాయి తాగి, మహిళలు ను వేధిస్తున్నారని. పోలీసు అధికారులు ఈ సమస్య పై దృష్టి సారించాలని. దసరా తరువాత అన్ని సమస్యల పై ప్రజల సహకారంతో బారీ నిరసన కార్యక్రమం చేపడతామని, అలాగే వైసీపీ నాయకుల అవినీతి పెరిగి పోయిందని. ప్రతీ పనికి ఒక రేటు వసూలు చేస్తున్నారని. ప్రజా సమస్యలు పట్టించుకోవడం లేదని. కనీసం కరెంటు స్తంభం బాగు చేయడం కోసం కూడా కార్పొరేటర్ అందుబాటులో లేదని ప్రజలు తెలియ జేశారని అన్నారు. రానున్న రోజుల్లో వెల్లంపల్లి శ్రీనివాసరావు నా చేతిలో ఓడిపోవడం ఖాయమని అన్నారు.
48వ డివిజన్ అధ్యక్షులు కోరగంజి వెంకటరమణా మాట్లాడుతూ గత 60రోజులు నుంచి జనసేన పార్టీ తరఫున అచ్చంగా కొండ ప్రాంతంలో తిరుగుతూ ప్రజల సమస్యలు తెలుసుకోవడం జరిగింది చాల చోట్ల పెన్షన్లు తీసేసారు అని, కరెంట్ స్తంభాలు ఒరిగిపోయీ ప్రమధభరితంగా వున్నాయి అని అదే విధంగా చెత్త పన్ను వసూలు చేస్తున్నారు గాని చెత్త మాత్రం తీయడం లేదని, పన్నులు , కరెంట్ బిల్లులు పెంచేశారు అని మహేశ్ గారు మీరు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో బాగా పనిచేస్తున్నారు కాబట్టి రాబోయే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని బల పరుస్తూ మిమ్మల్నే గెలిపించుకుంటామని ప్రజలందరూ కూడా చెప్పడం జరిగిందని అదేవిధంగా భోజనం మహేష్ గారు గత నాలుగేళ్ల నుంచి ఎన్నో సమస్యల మీద పోరాటం చేయడం అదేవిధంగా తన సొంత డబ్బులతో సేవా కార్యక్రమాలు చేయడం అట్లాగే కేటి రోడ్డు పూర్తి కావడంలో పోతిన మహేష్ గారి కృషి ఎంతో ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో వేవిన నాగరాజు, పాలేటి మోహన్ రా వు,మరుపల్లి సింహాచలం, బత్తుల వెంకటేశ్వరరావు, నోచర్ల పవన్ కళ్యాణ్, దాసిన జగదీష్, ప్రదీప్ రాజ్, తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com