Logo
Date of Publish : 07 July 2022, 3:09 am
Editor : Sake Naresh

పేదలకు సరైన ప్రదేశాలలో ఇళ్ళ స్థలాలు ఇవ్వాలి : చిత్తూరు జిల్లా జనసేనపార్టీ ప్రధాన కార్యదర్శి దారం అనిత

      మదనపల్లె, (జనస్వరం) : ప్రతి పేదవానికి సొంతింటి కల తీర్చడానికి కేంద్ర ప్రభుత్వంతో కలిసి రాష్ట్ర ప్రభుత్వాలు ఇళ్ళు మంజూరు చేస్తున్నాయి. మన ఆంధ్రప్రదేశ్ లో జగన్ సర్కార్ ఘనంగా జగనన్న కాలనీలు అంటూ కేవలం ఇళ్ళు కాదు ఊళ్లు నిర్మిస్తాం అని చెప్పిందని అనిత తెలిపారు. వాస్తవంలోకి వస్తే ఊరికి దూరంగా, చెరువుల పక్కన, స్మశానాలలో, కొండ గుట్టల్లో ఇళ్ళు మంజూరు చేయడంతో లబ్దిదారులు అయోమయంలో పడ్డారని వాపోయారు. అనంతపురం రూరల్‌ మండలం కామారుపల్లి గ్రామ పరిధిలో చెరువుకు సమీపంలో, పుట్లూరు మండలంలో కొండగుట్టల్లో, ఉరవకొండ శివారులో స్మశానవాటికలో సుమారు 67,772 మందికి ఇళ్లు హడావిడిగా మంజూరు చేశారు. జగనన్న కాలనీలలో సదుపాయాలు ప్రభుత్వం కల్పిస్తుందని చెప్పారు. రెండేళ్లలో ఒక్క సదుపాయం కూడా కల్పించలేదు. చిత్తశుద్దితో ప్రజలకు మంచి చేయాలి గానీ ప్రచార ఆర్భాటం కోసం చేస్తే ఇలానే ఉంటుందని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రజలకు మెరుగైన చోట ఇళ్ళు మంజూరు చేయాలని జనసేనపార్టీ తరుపున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com