Logo
Date of Publish : 21 September 2023, 10:13 pm
Editor : Sake Naresh

మౌలిక సదుపాయాలు కరువై ఇక్కట్లు పడుతున్న నిరుపేదలు

           జగ్గంపేట ( జనస్వరం ) : జనం కోసం జనసేన మహాయజ్ఞం 651వ రోజులో భాగంగా గోకవరం మండలం కొత్తపల్లి గ్రామంలో ప్రతి ఇంటిని సందర్శించిన జగ్గంపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి సూర్యచంద్ర. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ కొత్తపల్లి గ్రామంలోని ఎస్టీ కాలనీలో తిరుగుతున్న సమయంలో వారు చెప్తున్న కష్టాలు వింటుంటే కంటతడి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ గ్రామంలో ఎస్టీ కాలనీలో ఎక్కువ శాతం గృహాలలో వ్యక్తిగత మరుగుదొడ్లు లేకపోవడం వలన మహిళా తల్లులు చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ప్రభుత్వం స్వచ్ఛ సంకల్పం అని ఎంతో గొప్పగా చెప్పుకుంటున్న తరుణంలో చాలా నిరుపేద, బడుగు, బలహీన వర్గాలకు సంభందించిన వారికి కనీస మౌలిక వసతులు అంటే వ్యక్తిగత మరుగుదొడ్లు, త్రాగు నీరు, రహదార్లు, విద్యుత్తు వంటి సదుపాయాలు లేకపోవడమే కాకుండా వారు నివసిస్తున్న తాటాకు ఇళ్ళకి కనీసం పాడైపోయిన ఆకులు మార్చుకునే స్థితిలో కూడా లేకపోవడం గమనార్హం. ప్రభుత్వం వెంటనే స్పందించి ఒక సర్వే నిర్వహించి మౌలిక వసతులు లేని ప్రాంతాలను గుర్తించి వారికి వెంటనే కనీస సదుపాయాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించని తరుణంలో జనసేన పార్టీ నుండి తీవ్ర ఆందోళన కార్యక్రమాలు నిర్వహించి, భాదితులకు న్యాయం జరిగే వరకు పోరాడతామని చెప్పారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com