Search
Close this search box.
Search
Close this search box.

శ్రీ పవన్ కల్యాణ్ గారి రాజకీయ ప్రస్థానం మరియు జనసేన పార్టీ ఆవిర్భావం

శ్రీ పవన్ కల్యాణ్ గారి రాజకీయ ప్రస్థానం మరియు జనసేన పార్టీ ఆవిర్భావం

శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకముందు :

                తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా, దేశంలో కూడా వివిధ ప్రాంతాల్లో విశేషమైన ప్రజాదరణ ఉన్న నటుల్లో పవన్ కళ్యాణ్ ఒకరు. ప్రజాదరణతో పాటు సామాజిక స్పృహ కూడా ఉన్న అతికొద్ది మంది వ్యక్తుల్లో పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ముందు వరుసలో ఉంటారు. మొదటినుండి కూడా సినిమా కంటే సమాజం బాగుండాలని తనవంతు భాద్యతలు నిర్వర్తిస్తూ పరితపించే వ్యక్తి శ్రీ పవన్ కల్యాణ్ గారు. సాయం చేస్తే మూడో కంటికి కూడా తెలియకుండా కొన్ని కొన్నిసార్లు తన పరిధికి మించి మరి సాయం చేస్తుంటాడు. ఎన్నో భూరి దానాలు చేసిన, ఆపదలో ఉన్న మరెందరికో తన ఆపన్న హస్తం అందించిన, ఇంకా ఏదో చేయాలన్న అభిలాష శ్రీ పవన్ కల్యాణ్ గారిని నిరంతరం వెంటాడేది. ప్రతిరోజూ వార్తల్లోనూ, దినపత్రికల్లోనూ వివిధ సంఘటనలు చూసి, అవినీతి అక్రమార్కుల వలన సమాజం నరకకూపంగా మారుతుందని భావించి “తన పరిధిలో సమాజనికి వీలైనంత ఎక్కువ చేయాలనే సదుద్దేశంతో 2007 లో ” Common Man Protection Force ” అనే ఒక స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి, అదే రోజున ఒక కోటి రూపాయలు అందులో జమ చేసి, తనతో పాటు తన ఆశేష అభిమానులు, ఆప్తులు, స్నేహితులు దానికి సహకరించి అందులో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చి, స్వచ్ఛంద సంస్థను సంప్రదించడానికి చిరునామా(అడ్రెస్), ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు. అందుకోసం ప్రత్యేక ఫోన్ నెంబర్లు కూడా తీసుకొని, ఆపదలో అందరికీ సాయంగా ఉండాలని, ఎప్పుడైనా తనను సంప్రదించవచ్చు అని ఉద్ఘాటించాడు”.  

                   సమాజం కోసం పరితపించే శ్రీ పవన్ కల్యాణ్ గారు, తాను స్థాపించిన ” Common Man Protection Force ” స్వచ్ఛంద ద్వారా ఎక్కువ మందికి చేరువ కాలేకపోతున్నారనే బాధ ఆయనను ఎప్పుడు వేధిస్తూ ఉండేది. దానికి సరైన మార్గం రాజకీయాలే అని భావించారు. అలాంటి సమయంలోనే శ్రీ పవన్ కల్యాణ్ గారి సోదరుడు అయిన శ్రీ చిరంజీవి గారు, ప్రజలకు సేవ చేయాలనే దృక్పధంతో ప్రారంభించిన ప్రజారాజ్యం పార్టీ యువరాజ్యం అధ్యక్షుడిగా భాద్యతలు చేపట్టి అప్పటి ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం మొత్తం ప్రచారంలో పాల్గొని తన ప్రత్యక్ష రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు శ్రీ పవన్ కల్యాణ్ గారు. ఆ విధంగా తన ప్రత్యక్ష రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. మొదటి నుండి సామాజిక స్పృహ ఎక్కువ ఉండటం చేత, అప్పటి రాజకీయ నాయకుల పాలనకు ఎలాంటి అభివృద్ది నోచుకోని ప్రాంతాలను, దరిద్రంలో కొట్టుమిట్టాడుతున్న ఎంతోమంది పేద ప్రజలను తన పర్యటనలలో ప్రత్యక్షంగా చూసి చలించిపోయారు. ఆయన ప్రసంగాల్లో కూడా ఆ ఆవేశం, ప్రజలను నాటి దోపిడిదారుల నుండి ఎలాగైనా కాపాడాలి అనే ఆవేదన స్పష్టంగా కనిపించేది. రాష్ట్రమంతా పర్యటించి తన సోదరుడు శ్రీ చిరంజీవి గారి భావజాలాన్ని, ప్రజారాజ్యం పార్టీ యొక్క ఆశయాల్ని ప్రజలకు వివరించేవారు. తన ప్రచారానికి, పార్టీ నుండి కానీ, మరే వ్యక్తి నుండి కానీ ఒక్క రూపాయి తీసుకోకుండా, హైదరాబాద్ లో ఉండే తన స్థలాన్ని (హైటెక్ సిటి దగ్గర గల ప్రాంతంలో) అమ్మి, ఆ అమ్మగా వచ్చిన డబ్బుతో తన పర్యటన చేశారు. తన పరిధి మేరకు ఇతరులకు సాయం చేయాలనుకునే వ్యక్తే కానీ ఇతరుల నుండి ఒక్క రూపాయి కూడా ఆశించని వ్యక్తి శ్రీ పవన్ కల్యాణ్ గారు. ఇది అనేకమార్లు రుజువయ్యింది కూడా. అప్పటి పరిస్థితులు మరియు నిరంతరంగా శ్రీ చిరంజీవి గారిపై, ప్రజారాజ్యం పార్టీపై మీడియా పేపర్ ద్వారా చేసిన దుష్ప్రచారం వలన అనుకున్నంత రీతిలో సీట్లు సాధించలేకపోయింది ప్రజారాజ్యం పార్టీ. ఎటువంటి ప్రలోభాలకు పోకుండా, ఎలాంటి అనుభవం లేని సాధారణ మధ్యతరగతి వ్యక్తులను కూడా రాజకీయాల్లోకి తీసుకొచ్చిన ఘనత శ్రీ చీరంజీవి గారికి దక్కుతుంది.

                 అప్పటి ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన స్వర్గీయ YSR గారు, అనుకోని హెలికాప్టర్ ప్రమాదంలో శరీరాన్ని విడిచిపెట్టేయడంతో రాష్ట్రంలో అనుకోని రాజకీయ అనిశ్చితి ఏర్పడింది. కొన్ని అనుకోని సంఘటన వలన శ్రీ చిరంజీవి గారు తన శాసనసభ్యులను కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడం, ఆయన కేంద్రమంత్రి అవ్వడం క్రమంగా జరిగిపోయాయి. ఇంకోపక్క శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారు, తన అనుకూల వ్యక్తులతో సి‌ఎం పదవి ఆశించిన అది వీలు కాకపోవడంతో, YSR కాంగ్రెస్ పార్టీ స్థాపించారు. మరోపక్క అదే సమయంలోనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఉద్యమం ఊపందుకోవడం, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడటం జరిగింది.

జనసేన పార్టీ ఆవిర్భావం:

                   ఇవన్నీ ప్రత్యక్షంగా చూస్తూ, ఎలాగైనా ఈ వ్యవస్థను తన పరిధి మేరకు వీలైనంత మార్చాలని, 2014 మార్చ్ 14 వ తేదీన “జనసేన” పార్టీకి శ్రీకారం చుట్టారు శ్రీ పవన్ కల్యాణ్ గారు. అప్పటికి ఆంధ్ర ప్రాంతం రాయలసీమ ఉత్తరాంధ్ర కోస్తాంధ్రతో కలిపి మొత్తం 13 జిల్లాలతో ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి, ఆర్థికలోటుతో కూరుకొనిపోయింది. జనసేన పార్టీని స్థాపించిన శ్రీ పవన్ కల్యాణ్ గారు, అప్పటికి తన పార్టీ యొక్క వ్యవస్థాగత సంస్థ ఏర్పాటు కాకపోవడంతో, 2014 సార్వత్రిక ఎన్నికల్లో టి‌డి‌పి-బి‌జే‌పి పొత్తుకుకి తన పూర్తి మద్దతును ప్రకటించారు. ఆంధ్ర రాష్ట్రం నుండి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాడ్డాక, ఆంధ్ర రాష్ట్రం అన్ని విధాలా నష్టాల్లో ఉందని భావించి “అప్పటికే మంచి రాజకీయ అనుభవం మరియు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన శ్రీ చంద్రబాబు నాయుడు గారు” అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లగలరనే పూర్తి విశ్వాస్వంతో టి‌డి‌పి-బి‌జే‌పి కి తన పూర్తి మద్దతు ప్రకటించి పర్యటించారు. మరోపక్క శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారు, రాష్ట్రం విడిపోకముందు కాంగ్రెస్ పార్టీలోని ఉన్న నాయకులందరితో కలసి వై‌ఎస్‌ఆర్‌సి‌పి పార్టీ పేరుతో 2014 సార్వత్రిక ఎన్నికల్లో ప్రత్యక్ష పోటీకి నిలబడ్డారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో టి‌డి‌పి-బి‌జే‌పి కి మద్దతు తెలిపిన కారణం చేత, రాష్ట్రం మొత్తం టి‌డి‌పి, బి‌జే‌పి నాయకులతో కలిసి అనేక ర్యాలీల్లోనూ సభల్లోనూ ప్రత్యక్షంగా పాల్గొని టి‌డి‌పి-బి‌జే‌పి పొత్తు గెలుపు కొరకై తన శాయశక్తుల పోరాడారు శ్రీ పవన్ కల్యాణ్ గారు. అనుకున్నట్లుగానే టి‌డి‌పి-బి‌జే‌పి పొత్తు 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఘనవిజయం సాధించి౦ది. తమ విజయానికి కారణమైన శ్రీ పవన్ కల్యాణ్ గారిని ఏదో ఒక పదవి ఇచ్చి, కృతజ్ఞత చూపించుకోవాలని రాష్ట్రంలో చంద్రబాబు గారు, కేంద్రంలో మోడి గారు అడిగారు. దీనిని సున్నితంగా తిరస్కరించి “రాష్ట్ర అభ్యున్నతే తనకు కావాలని, ఎలాంటి పదవులు అవసరం లేదని” తన మనసులోని అభిప్రాయం తెలిపారు శ్రీ పవన్ కల్యాణ్ గారు.

              దాదాపు 10 సంవత్సరాల తరువాత అధికారంలోకి వచ్చిన శ్రీ చంద్రబాబు నాయుడు గారు మరియు అతని పార్టీలోని నాయకులు అభివృద్దికి తీలోదకాలిచ్చి రాష్ట్రాన్ని దోచుకోవడం మొదలుపెట్టారు. ఇదంతా గమనిస్తున్న శ్రీ పవన్ కల్యాణ్ గారు, ఎప్పటికప్పుడు చంద్రబాబు గారి ప్రభుత్వాన్ని అప్రమత్తం చేస్తూ, సూచనలు చేస్తుండేవారు. ఆయన ఎన్ని చేసిన, టి‌డి‌పి వారు “వారి పంథా వారిదే అన్నట్లు” వ్యవహరించేవారు. అప్పటికే రాష్ట్రం విడిపోయి, ఒక ప్రత్యేక రాజధాని అంటూ ఏర్పడకపోవడంతో మరియు టి‌డి‌పి ప్రభుత్వంలోని నాయకులు ఉన్న రాష్ట్రాన్ని దోచుకోవడంతో మరింత కష్టాల్లోకి పోయింది ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి. ఒకానొక సమయంలో చంద్రబాబు నాయుడు గారు మాట కూడా లెక్కచేయకుండా యధేచ్చగా దోచుకోవడానికి తెగబడ్డారు టి‌డి‌పి లోని కొంతమంది నాయకులు.

                        “రాష్ట్రంలోని ఒక మహిళా అధికారి మీద చేయి చేసుకోవడం, ఇసుక అక్రమాలు చేయడం, పోలవరం ఇదిగో అదిగో అంటూ జాప్యం చేస్తూ వృధా ఖర్చులు చేయడం, ధర్మ పోరాటాలు అంటూ రాష్ట్ర ఖజానాన్ని లూటీ చేయడం, సింగాపుర్ జపాన్ రాజధానులు ప్లానులు మెట్రోలు అంటూ వివిధ రకాలైన అందమైన భవంతుల నిర్మాణాలతో దినపత్రికలను నింపి ప్రజలను ఆశ పెట్టి అయోమయంలోకి తోసెయ్యడం, అక్రమస్తుల కేసులో ఉన్న శేఖర్ రెడ్డిని వెనకేసుకురావడం మరియు టి‌టి‌డి లో ఆయనకు స్థానం కల్పించడం, కొన్ని నెలలు ప్రత్యేక హోదా అని మరి కొన్ని నెలలు ప్రత్యేక ప్యాకేజ్ అంటూ తీసుకొని రాష్ట్ర ప్రజలను అణచివేసే ప్రయత్నం చేసి “ప్రత్యేక హోదా కన్నా ప్రత్యేక ప్యాకేజ్ మిన్న” అంటూ ఉదరగొట్టే పేపర్ ప్రకటనలు చేసి, మరోపక్క తెలంగాణ రాష్ట్రంలో ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయి, 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని అయిన హైదరాబాద్ ను విడిచి వచ్చేయడం, దాదాపు తన పరిపాలన మొత్తం కాలం ఒక ఖరిదైనా నోవాటేల్ హోటల్లో ఉండి దానికి రాష్ట్ర ఖజానాన్ని ఖర్చు పెట్టడం, ప్రజల పన్నును వారి సొంత ఖర్చులకు ఉపయోగించడం, అమరావతి రాజధాని అని ప్రకటించి అక్కడ భూమిని, రైతులను కొల్లగొట్టడం, కేంద్రం మీద దండ యాత్ర అంటూ మీరంటే మీరు రాజీనామా చేయండి అని టి‌డి‌పి ysrcp ఎం‌పి లు పోటాపోటి మాటల తుటాలు సంధించడం, అన్నీ విధాలుగా ప్రచార ఆర్భాటాలే తప్ప అభివృద్ది ఊసే లేకపోవడం” ఇలా టి‌డి‌పి ప్రభుత్వ హయాంలో లెక్కలేనన్ని దుబారా ఖర్చులు, అధికార దుర్వినియోగం అయ్యే ఎన్నో సంఘటనలు జరిగాయి.

             వీటన్నింటినీ ఎప్పుడు ఒక కంట కనిపెడుతున్న శ్రీ పవన్ కల్యాణ్ గారు, “టి‌డి‌పి ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు తనవంతు బాధ్యతగా సూచనలు, నిర్ణయాలు” చేస్తుండేవారు. పవన్ కల్యాణ్ గారు టి‌డి‌పి ప్రభుత్వానికి ఎన్ని సూచనలు చేసిన అవన్నీ బేఖాతరు చేసి, ఇంకోసారి టి‌డి‌పి ప్రభుత్వం వస్తాదో రాదో అనే విధంగా దోపిడి చేసేశారు రాష్ట్రాన్ని. టి‌డి‌పి ప్రభుత్వం విధానాలతో విసిగిపోయిన కేంద్ర బి‌జే‌పి ప్రభుత్వం సరైన నిధులు మంజూరు చేసేది కాదు. దీనికి కారణం టి‌డి‌పి ప్రభుత్వం వైఫల్యం అనడంలో ఎటువంటి సందేహం లేదు. మరోపక్క చంద్రబాబు గారి ప్రభుత్వాన్ని ఎండగడుతూ, అరచేతిలో వైకుంఠం చూపించేలా వీలుకాని వాగ్దానాలు చేస్తూ ప్రజలను తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తూ రాష్ట్రమంతా “ఓదార్పు యాత్రను” చేస్తూ, వీధి వీధినా, వాడ వాడల వాళ్ళ నాన్న గారి విగ్రహాలు పెట్టి “రాజన్న రామ రాజ్యం” మళ్ళీ నాతోనే సాధ్యం అంటూ ప్రజల్లోకి వెళ్లారు శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారు. ఆంధ్ర రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోవడమే కాదు, ఆర్థికలోటు నిరుద్యోగ సమస్యతో పాటు అన్నివిధాల నష్టపోయింది. శ్రీ పవన్ కల్యాణ్ గారు ఒకానొక సందర్భంలో “ఈ రాజకీయ నాయకులు ప్రభుత్వాలు సరిగ్గా పనిచేస్తే, నేను రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం లేదు. నాపాటికి నేను సినిమాలు చేసుకుంటూ బతికేవాడిని” అని చెప్పారు. కానీ ఆనాటి వాస్తవ పరిస్థితులు తొందరలోనే గ్రహించడానికి ఎక్కువ సమయం పట్టలేదు శ్రీ పవన్ కల్యాణ్ గారికి. రాష్ట్రానికి టి‌డి‌పి ప్రభుత్వంతో జరిగిన నష్టం చాలు అని భావించి, టి‌డి‌పి పార్టీకి దూరం జరిగారు పవన్ కల్యాణ్ గారు. ఇది టి‌డి‌పి పార్టీకి మింగుడుపడని విషయం. ఉంటే మా పార్టీలో ఉండాలి లేక కనీసం మాతో పొత్తులో అయిన ఉండాలి లేకపోతే రాజకీయ భవిష్యత్తే ప్రశ్నర్దక౦ అనుకున్నారేమో కానీ, శ్రీ పవన్ కల్యాణ్ గారిని “వ్యక్తిత్వ హననం చేపిస్తూ నెలల తరబడి సినిమా మీడియా వారి ద్వారా తిట్టిస్తు, సమాజంలో పలుకుబడి ఉన్న వారి చేత నెలల తరబడి అన్నీ ప్రముఖ న్యూస్ చానెల్లో నిరంతర చర్చ కార్యక్రమాలు ప్రసారం చేసి, శ్రీ పవన్ కల్యాణ్ గారి యొక్క మాతృమూర్తిని సహ తిట్టించారు. దీనికి తోడు శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారు తన పలుకుబడిని, YSR మరణాన్ని సానుభూతిగా మార్చుకొని, సాక్షి పత్రిక మీడియా ద్వారా నిరంతర ప్రసారాలు కొనసాగించారు. దీనికి తోడు వ్యక్తిత్వ లాభాల కోసం అర్రూలు చాచే కొంతమంది టి‌వి, సినిమా ప్రముఖులు ఒక పక్క శ్రీ పవన్ కల్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ మరోపక్క వాళ్ళు నమ్మిన (వాళ్ళకు ఉపయోగపడే) పార్టీలకు వత్తాసు పలకడం ప్రారంభించారు”.

                       ఈ విధంగా నెలల తరబడి అధికార ప్రతిపక్షాలు శ్రీ పవన్ కల్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ వ్యక్తిత్వ హననం తారస్థాయికి తీసుకెళ్లారు. “ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ప్రభుత్వంలో ఉంటే అధికార పార్టీ టి‌డి‌పి లేక ప్రతిపక్షం వై‌ఎస్‌ఆర్‌సి‌పి ఉండాలి కానీ ఇంకొక కొత్త పార్టీకి, కొత్త వ్యక్తికి చోటు ఉండదు ఉండకూడదు” అనేలా అప్పటి అధికార ప్రతిపక్ష పార్టీలు శ్రీ పవన్ కల్యాణ్ గారి విషయంలో వ్యవహరించాయి. ఇది ఆంధ్ర రాష్ట్రంలోని ప్రతి ఒక పౌరునికి విదితమే. వీలైనంత ప్రజాసేవ చేద్దామని రాజకీయాల్లోకి వచ్చిన పవన్ గారికి ఇదొక చెడు అనుభవం. ఈ అనుభవమే ఆయన్ని మరింత మొండిగా చేసింది. “ఒక మంచి పని చెయ్యడానికి ఇంతమంది అడ్డుపడుతున్నారంటే? అవినీతి అక్రమాలు రాజకీయాల్లో ఎంతల పాతుకుపోయున్నాయో” దీనిని చూస్తే అర్థమైపోతుంది.

2019 సార్వత్రిక ఎన్నికల ప్రయాణం:

             అప్పటివరకూ అధికారంలో ఉన్న టి‌డి‌పి ప్రభుత్వానికి కేవలం మిత్రపక్షంల వ్యవహరించి సూచనలు సలహాలు చేసి విసిగిపోయిన శ్రీ పవన్ కల్యాణ్ గారు, 2019 లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఏ పార్టీతో వెళ్లకుండా, స్వతంత్రంగా పోటీ చేయాలని భావించి “జనసేన పోరాట యాత్రలను” ప్రారంభించి రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో సభలను నిర్వహించారు. శ్రీ పవన్ కల్యాణ్ గారు వెళ్ళిన ప్రతి నియోజక వర్గంలో ఎన్నో ఏళ్లుగా(దశాబ్దాలుగా) ఉండిపోయిన సమస్యలను వెలికితీస్తూ వాటిని ప్రభుత్వానికి విన్నవిస్తూ, సమస్య పరిష్కారం కోసం తనవంతు కృషిని చేసారూ. అలాంటి వాటిలో ఉద్దానం సమస్య ఒకటి. మార్చ్ 14 2019 నా జనసేన పార్టీ 5 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా రాజమండ్రిలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. రాజమండ్రి సభలో, టి‌డి‌పి ప్రభుత్వం యొక్క వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ, అలాగే అన్నీ సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండి ప్రభుత్వ పనీతీరును పరిశీలించి, తప్పులను ఎండగట్టాల్సిన ప్రతిపక్షం YSRCP ఓదార్పు యాత్ర అంటూ అసెంబ్లీ సమావేశాలు కూడా హాజరు కాకుండా విగ్రహాలు ప్రతిష్టించడంలో నిమగ్నమయ్యింది అని YSRCP ని కూడా తన విమర్శనస్త్రాలతో ప్రశ్నించారు శ్రీ పవన్ కల్యాణ్ గారు. రాజమండ్రి సభ తరువాత, రాష్ట్రంలో టి‌డి‌పికి గట్టి దేబ్బే తగిలింది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఏమి ఆశించకుండా, కేవలం ప్రజాక్షేమం కోరి మద్దతు తెలిపిన శ్రీ పవన్ కల్యాణ్ గారిని టార్గెట్ చేసుకుంది టి‌డి‌పి పార్టీ. అప్పటి ప్రతిపక్ష పార్టీ YSRCP కూడా దీనికి మినహాయింపు ఏమి కాదు. అయిన కూడా అన్ని అవమానాలను భరిస్తూ, నిందలను మోస్తూ తన పోరాటయాత్రను కొనసాగించారు పవన్ కల్యాణ్ గారు. తనతో కలిసి వచ్చే CPI CPM లతో పొత్తు కుదుర్చుకొని 2019 లో జరిగే సార్వత్రిక ఎన్నికల రాజకీయ సంగ్రామంలో టి‌డి‌పి YSRCP పార్టీలకు ఎదురు నిలిచారు శ్రీ పవన్ కల్యాణ్ గారు.

                   ఇక్కడ శ్రీ పవన్ కల్యాణ్ గారి 2019 సార్వత్రిక ఎన్నికల ప్రస్థానం చూసుకున్నట్లయితే “సొంత న్యూస్ చానల్ లేదు, పేపర్ లేదు. కనీసం శ్రీ పవన్ కల్యాణ్ గారి పోరాట యాత్రలు లైవ్ గా ప్రసారాలు చేయలేదు, ప్రసారం చేసే చానెళ్లను బెదిరించి, కేబుల్ చానెళ్లను బెదిరించి, కొన్నిచోట్ల విద్యుత్ అంతరాయం కలిగించి జనసేన పోరాట యాత్ర ప్రసారలను ప్రజల్లోకి వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు”. రెండు మూడు సార్లు శ్రీ పవన్ కల్యాణ్ గారి మీద హత్య ప్రయత్నం కూడా చేశారు. కేవలం ఆంధ్ర రాష్ట్ర న్యూస్ చానెళ్లు శ్రీ పవన్ కల్యాణ్ గారిని తిడుతుంటే చూపించే వార్తాలే ప్రసారం చేశారు కానీ ఆయన భావజాలంతో కూడిన జనసేన పోరాట యాత్రలు లైవ్ చూపించడం అరుదు. “ఆ విధంగా జనసేన అంటే కేవలం శ్రీ పవన్ కళ్యాణ గారే అనే ముద్రా వేసి, ఆయనను వ్యక్తిత్వ హననం చేసే వార్తలు నిరంతర ప్రసారం చేసిన న్యూస్ చానెళ్లు, అవి ప్రచురించిన న్యూస్ పేపర్లు, జనసేన పోరాట యాత్రకు సంబంధించిన వార్తలకు అస్సలు ప్రాధాన్యం లేకుండా ప్రజలలో ఒకరకమైన భావనా తీసుకొచ్చారు. జనసేన అంటే పవన్ గారే, జనసేనకు ఉనికి లేదు, పార్టీ సంస్థాగతం లేదు అని పదే పదే న్యూస్ చానల్లో వక్కాణించి చెప్పారు”. ఆ విధంగా జనసేనకు ఆంధ్ర మీడియా కూడా నష్టం చేకూరేలా చేసింది. రాష్ట్రం అభివృద్ధిలోకి ముందుకు వెళ్లాలంటే, యువత ముఖ్యం అని భావించి, ఎంతోమంది సాధారణ వ్యక్తులను ఎం‌ఎల్‌ఏ అభ్యర్థులను నిలబెట్టారు శ్రీ పవన్ కల్యాణ్ గారు. వారిని ప్రత్యేకంగా ఎన్నుకొని, వారి సామర్థ్యం నిజాయితీ పనితీరు గమనించక పార్టీలోకి ఆహ్వానించారు.

                  “జనసేనకు నీతి నిజయీతీతో కూడిన నాయకులు ఉన్నారు అలాగే నీతి నీజాయితీగా నమ్మి వోటు వేసే లక్షలాది ఓటర్లు ఉన్నారు. కానీ నిజాన్ని నిజంగా, అబద్దాన్ని అబద్దంగా చూపించే న్యూస్ చానల్ ఏదైనా ఉందా రాష్ట్రంలో? అలాగే నిజాన్ని నిజంగా రాసే దినపత్రిక ఏదైనా ఉందా? “ ఒక వార్తను పదే పదే ప్రసారం చేస్తే, తప్పొప్పులతో సంబంధం లేకుండా కొన్ని రోజుల్లోనే అది నిజం అని నమ్మే మనలాంటి సామాన్య ప్రజలు నెలల తరబడి ఒక వ్యక్తి వ్యక్తిత్వాన్ని హాననం చేస్తుంటే అది తప్పు అని తిరగబడిన, కనీసం మద్దతు తెలిపిన సందర్భాలు ఉన్నాయా?(కొంతమందిని మినహాయించి). వేరే చానల్ మార్చినంత సులభం కాదు మార్పు రావాలంటే…! ముందు మనం ప్రజలు మారాలి, తరువాతే ఏదైనా సాధ్యం. 2019 సార్వత్రిక ఎన్నికల ఓటమి తరువాత, చాలామంది చాలా సలహాలు చేశారు శ్రీ పవన్ కల్యాణ్ గారికి. కొంతమంది టి‌డి‌పితో కలిసిపో అంటే మరికొంతమంది ఇంకా ఆ పార్టీ ఉందా? అని హేళన చేశారు. “ఒక ఇంటిలో నలుగురిని ఒకే తాటిపైకి తెచ్చి, కుటుంబాన్ని ముందుకు నడిపించాలంటే ఎంత కష్టమో ఆ ఇంటి పెద్దకే తెలుసు. అలాంటిది ఒక పార్టీ పెట్టి, దశాబ్దాలుగా పాతుకుపోయి ఉన్న అవినీతి అక్రమార్కులను ఎదుర్కొని, మరోపక్క నుండి సొంత సినిమా పరిశ్రమ వారే చేసే వెకిల చేష్టలను భరిస్తూ, ఇంకోపక్క వ్యక్తిత్వ హనానికి తెగబడి దాడులు చేస్తున్న న్యూస్ చానేళ్ళను దినపత్రికలను  ఎదుర్కుంటూ, సొంత పార్టీలోనే వేరే పార్టీకి పని చేసేవారిని గుర్తించి వారిని వేరేస్తూ, ప్రజల్లోకి వెళ్ళి తన నిజాయితిని నిరూపించుకుంటూ, వారిని తన ఓటర్లుగా ప్రభావితం అయ్యేలా మార్చుకోవడం” ఎంత కష్టమో ఒకసారి ఆలోచించండి.

                శ్రీ పవన్ కళ్యాణ్ గారికి పదవి కావాలంటే, 2014 లోనే పొందేవాడు. ఒక నిజయీతి గల వ్యక్తి అని పార్టీలోకి చేర్చుకొని, అతను ఎం‌ఎల్‌ఏ అయ్యేందుకు కష్టపడి అన్నీ విధాలా చేసిన, ఇప్పుడు ఆయన ఏ పార్టీలో ఉన్నాడో? ఎవరికి ఊడిగం చేస్తున్నాడో? ఆలోచించండి. ప్రస్తుత కాలంలో ఒక నిజయీతి గల వ్యక్తిని సంపాదించడం అంతా సులభం కాదు. అలా అని నిజయీతీ గల వ్యక్తుల కోసం ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలు చూడాలి అంటే? మనమే అలాంటి వ్యక్తులను తయారు చేసుకోవాలి. మనలో నుండే అలాంటి వ్యక్తులు రావాలి. మనమే అలాంటి వ్యక్తులుగా మారాలి. 2019 ఎన్నికల ఓటమి తరువాత వివిధ జిల్లా నాయకులతో, నియోకవర్గ ఎం‌ఎల్‌ఏ అభ్యర్థులతో ఎప్పటికప్పుడు చర్చలు జరిపి, 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఓటమికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. జనసేన పార్టీ క్యాడర్ నిజయీతితో కూడిన వ్యక్తులతో బలపడేలా నిరంతరం శ్రమిస్తున్నారు.

                ఒకపక్క పార్టీని నడపడానికి ఆర్థిక తోడ్పాటుకు కొత్త సినిమాలు అంగీకరించి, మరో పక్క రాజకీయాలను సమన్వయం చేస్తున్నారు. పార్టీ మీటింగులను జరుపుతున్నారు. ప్రస్తుత కరోన కాలంలో నేరుగా నియోజక వర్గానికి వెళ్ళి పార్టీ క్యాడర్ ను మరింత బలోపేతం చేసే దిశగా ఏర్పాటు చేయలేరు. దీనిలో భాగంగానే మొదట క్రియయాశీలక కార్యకర్తల నమోదు కార్యక్రమం ప్రారంభించారు. దీని గురించి ఎప్పటికప్పుడు వివరాలు సేకరిస్తూ ముఖ్యమైన నాయకులతో అందుబాటులో ఉన్నాడు. ఇది పార్టీని బలోపేతం చేసే దిశగా వేసిన తొలి అడుగే. గ్రామస్థాయి నుండి మండల స్థాయి, నియోజక వర్గ స్థాయి, జిల్లా స్థాయి వరకు ఇలాంటి కార్యక్రమాన్ని విస్తృతంగా ముందుకు తీసుకెళ్లి విజయవంతం చేయాలి. జనసేనాని కూడా కార్యకర్తలను, నియోజకవర్గ మండల స్థాయి లీడర్లను విరివిగా కలవాలి. సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసి నిరంతరం ప్రజల్లో ఉండేలా ప్రణాళికలు చేయాలి. కరోన ప్రభావం తగ్గక, జనసేనాని దశలవారిగా మీటింగ్లు జరుపుతూ, కార్యకర్తలకు అందుబాటులో ఉంటారని తెలుస్తుంది. 

                 కరోన కాలంలో జనసేన పార్టీ చేసినన్ని సేవ కార్యక్రమాలు అధికార ప్రతిపక్షంతో సహ ఎవరు చేయలేదంటే అతిశయోక్తి కాదు. 750+ వరకు ఆక్సిజన్ సిలిండర్లు పంచడం, చాలాచోట్ల అన్నదానం చేయడం, మరికొన్ని చోట్ల రోడ్లు వేయడం, ఇంకొన్ని చోట్ల  కరోన బాధితులకు ఆర్థిక సాయం చేయడం, వైద్య పరంగా తోడుండము, కరోన కాలంలో గల్ఫ్ దేశాలలో ఇబ్బంది పడుతూ ఇంటికి వెళ్లలేక, అక్కడ పనిలేక ఇబ్బంది పడుతున్న తెలుగు రాష్ట్రాల వారిని, NRI జనసైనికులు తమ సొంత డబ్బులతో వారిని ఇండియా పంపించే ప్రయత్నం చేశారు. ఇలా గొప్ప గొప్ప సేవ కార్యక్రమాల్లో జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ గారి నుండి, సామాన్య జనసైనికుని వరకు తమ పరిధి మేరకు ఏదో ఒక విధంగా సాయపడారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారికి గెలవడం ముఖ్యం కాదు, అది ఎలా గెలిచామన్నదే ముఖ్యం. ఆ గెలుపు ధర్మంతో ముడిపడి ఉండాలి. ఎన్నికలకు ముందు డబ్బు పెట్టి ఓటర్లను కొంటె గెలవలేమా అంటే? గెలవగలము. కానీ నిజమైన అది గెలుపు కాదు. దానికంటే నిజయీతీగ వచ్చే ఓటమే ఎన్నో రేట్లు మేలు. అది నమ్మిన వారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. మరి ఇన్ని ఆలోచించే శ్రీ పవన్ కళ్యాణ్ గారిని, నమ్మిన మనమే ఆయన మీద ఒత్తిడి తెస్తే? మన అభిప్రాయాలూ ఆయన మీద రుద్దాలని ప్రయత్నిస్తే?

                   “2019 సార్వత్రిక ఎన్నికల ముందు మనలో ఒక సోదరుడు చెప్తూ, మా ఇంట్లో మా అమ్మ నాన్న ఎప్పటినుంచో టి‌డి‌పికి ఓటు వేస్తారు. కానీ ఈసారి అమ్మను జనసేనకు ఓటు వెయ్యడానికి ఒప్పించాను కానీ నాన్నను ఒప్పించలేకపోయాను, ఎందుకంటే ఆయన గెలిచిన ఓడిన ఎప్పటినుండో టి‌డి‌పికి ఓటు వేస్తున్నారు” అని అన్నారు. మన ఇంట్లోమాన నాన్న గారి ఓటే మన జనసేనకు వేపించలేనప్పుడు? మనం శ్రీ పవన్ కళ్యాణ్ గారి నిర్ణయాలు తప్పుపట్టి, ఆయన మీద ఒత్తిడి తెచ్చేలా ప్రవర్తించొచ్చా? ఆలోచించండి మిత్రులారా. ఇలా ఒక సోదరుడి ఇంట్లోనే కాదు, చాలామంది ఇళ్ళల్లో ఇదే. ఒకరేమో మా ఇంట్లో మా పెదనాన్న గారు తప్ప మిగతా ఓట్లు జనసేనకు, ఇంకొకరేమో మా తాతయ్య ఓటు తప్ప మిగతా ఓట్లు అన్నీ జనసేనకు ఇలా. శ్రీ పవన్ కళ్యాణ్ గారు చాలా దూరదృష్టి కలిగిన వారు. ఒకవేళ బహుశా కొన్నిసార్లు వెనక అడుగులు వేసినట్లు కనపడతారు కానీ అది కేవలం ప్రజ ప్రయోజనాల కోసం మరియు మన క్షేమం కొరకే అయ్యుంటుంది కానీ మరొకటి అయ్యుండదు.

బి‌జే‌పిత పొత్తు మరియు GHMC ఎన్నికలు:

              ముందుగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు బి‌జే‌పి తో పొత్తు పెట్టుకోవడానికి ప్రధాన కారణం “రాష్ట్రంలోని YSRCP ప్రభుత్వం యొక్క ఆగడాలను, అన్యాయాలను కొంతమేర అయిన అడ్డుకోవడానికి”. దానికి ప్రత్యామ్నాయంగా ఇంకా ఏ పార్టీ లేదు. టి‌డి‌పి పార్టీ ఉన్నా లేనట్లే ఉంటుంది. ఇక కాంగ్రెస్ అస్సలుకే లేదు. ఎలాగూ కేంద్రంలో ఉండే బి‌జే‌పితో పవన్ గారికి సత్సంబంధాలు ఉన్నాయి. కావున ముందుగా ఆంధ్ర ప్రజల క్షేమాలను దృష్టిలో పెట్టుకొని బి‌జే‌పి పొత్తు పెట్టుకున్నారు. “ఇక్కడ శ్రీ పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం అభినందించదగ్గది. గెలిచిన వారే ప్రజలను పట్టించుకొని పక్షంలో, గెలిచిన ఓడిన ప్రజల పక్షనే నిలుస్తాను, వారి సమస్యలకై పోరాడతాను అని భావించి బి‌జే‌పితో పొత్తు కుదుర్చుకున్నారు”. అందుకే శ్రీ పవన్ కళ్యాణ్ గారిని అర్థం చేసుకోవాలంటే ఓపికతో పాటు, ఆయన భావజాలం కూడా అర్థమై ఉండాలి. ప్రస్తుతం రాష్ట్రంలో జరిగే రంగుల కార్యక్రమం, సన్యాసుల పుట్టినరోజుల వేడుకుల కార్యక్రమం, ఆలయాల ఆస్తుల వేలం, రాజధానుల విషయం, తెలుగు మాధ్యమం తీసెయ్యాలనే ప్రణాళిక లాంటి పదుల సంఖ్యాల్లో (రమారమి 150) జీవోల వరకు కోర్టు తిరస్కరించాయి. వీటిలో ఏదైనా ఒకదానిని టి‌డి‌పి తరపున గెలిచిన అభ్యర్థులు అడ్డుకునే ప్రయత్నం చేశారా? ధర్నాలు చేశారా? ఒక్క అమరావతి విషయం తప్ప.

                         ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో కోర్టు పరిపాలన జరుగుతుందని చెప్పొచ్చు. ఒకవేళ కోర్టు అడ్డులేకుంటే, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విచ్చలవిడిగా జీవోలు విడుదల చేసుకొని రాష్ట్రాన్ని ఆసాంతం దీవాల తీయించేది. మరి ఇలాంటి పరిస్థితుల్లో “నా జనసేన పార్టీ నుండి ప్రశ్నించడానికి అడగడానికి చట్ట సభల్లో ఎవరు లేరు కదా? (ఉన్న ఒక ఎం‌ఎల్‌ఏ అనధికారంగా ప్రభుత్వానికి ఊడిగం చేస్తున్నారు) అని భావించి గమ్మునా ఉండొచ్చు. కానీ, ఇది శ్రీ పవన్ కళ్యాణ్ గారి స్వభావం కాదు. గెలుపు ఓటములు  తరువాత, ముందు నా ప్రజల క్షేమమే అని భావించి పొత్తు కుదుర్చుకున్నారు. దానిలో భాగంగానే రాష్ట్రంలో జరిగే అనేక అక్రమాలను డిల్లీలోని పెద్దలకు చేరవేస్తూ ప్రస్తుత ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆగడాలను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు.

               శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఒకటి ఏదైనా అంగీకరించారంటే/ఒప్పుకున్నారంటే, దానికి నూటికి నూరు శాతం తన శాయశక్తుల కొద్ది మాటకు కట్టుబడుతారు. పొత్తులో భాగంగానే బి‌జే‌పి నాయకులతో సాన్నిహిత్యం కావచ్చు, చర్చలు కావచ్చు, బి‌జే‌పి వారి ట్వీట్లు రీ-ట్వీట్లు చేయడం కావొచ్చు… ఇలా ఏదైనా సంపూర్ణంగా చేస్తారు. కానీ ఆయన ప్రతి అడుగు దూర దృష్టితోనే వేస్తారు, ప్రజల క్షేమం కోసమే ఆలోచిస్తారు. దీనికి గెలుపోటములు ఆలోచించారు. GHMC ఎన్నికల దృష్టిలో ముందునుండి పోటీ చేస్తాము అని చెప్పి చివరకు బి‌జే‌పికి మా సంపూర్ణ మద్దతు అని శ్రీ పవన్ కళ్యాణ్ గారు చెప్పినప్పుడు నేను కూడా ఒక జనసైనికుడిగా ఒకింత బాధపడ్డాను. ఎందుకంటే, అభ్యర్థులను ప్రకటిస్తా అని చెప్పి చివరికి మేము ఎలక్షన్లో పాల్గొనడం లేదు, అని చెప్పినప్పుడు. ఇక్కడ బి‌జే‌పికి మద్దతు ఇస్తున్నారు అని ఎవరు బాధపడలేదు కానీ, అది చివరి నిముషం వరకు అలా చేయకుండా ఉంటే బాగుండు అని చాలామంది జనసైనికుల అభిప్రాయం.

                    జనసేన మరియు బి‌జే‌పి విడివిడిగ పోటీ చేస్తే ఓట్లు చీలతాయి తద్వారా అధికార పార్టీ అయిన TRS పార్టీకి లాభం చేకూరుతుంది. తెలంగాణ రాజకీయాల దృష్ట్యా జనసేన-బి‌జే‌పి కలిసి ఒక్కరిగా GHMC ఎన్నికల్లో పోటీ చేయడం మంచి నిర్ణయం. అలాగే జనసేన తరపున పోటీ చేయాలనుకున్న అభ్యర్తులను ప్రత్యేకంగ కలిసి వారికి వాస్తవ పరిస్థితులను తెలపడం కూడా అంతే ముఖ్యం. శ్రీ పవన్ కళ్యాణ్ గారు తన పూర్తి మద్దతును బి‌జే‌పికి ప్రకటించడం ఆహ్వానించదగ్గ విషయం కానీ ఇది జనసేన అభ్యర్తులను ఎన్నుకోక ముందు ప్రకటించుంటే బాగుండేది అని కొంతమంది జనసైనికుల అభిప్రాయం. అంతిమంగా జనసేనాని నిర్ణయం దూరదృష్టి కలదు మరియు ఆయన ఆశయాలు ఎప్పుడు ప్రస్తుతం కొరకే కాదు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు చేస్తారు. ఇది ప్రతి జనసైనికుడు గుర్తించాల్సిన విషయం.

చివరగా:

               ఎప్పటిలాగే శ్రీ పవన్ కళ్యాణ్ గారి యందు నమ్మకముంచి ముందుకు కదలండి, ఆయన నిర్ణయాలను గౌరవించండి. శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు దూరదృష్టితో ఆలోచిస్తారు. ఆయన నిర్ణయాలు పరిశీలించి అర్థం చేసుకుంటే మనకు అవగతమౌతుంది. స్వల్ప ప్రయోజనలకు ఆశపడే వ్యక్తి కాదు. ఎప్పుడు దూరదృష్టితో గల ప్రయోజనాలను ఆలోచించి, అవి ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడతాయో అని నిరంతరం పరితపించే వ్యక్తి. ఆయన మనకు ఒక అడుగు వెనక వేసినట్లు కనిపించిన, అది దీర్ఘకాలిక ప్రయోజనాలు కొరకే. మనల్ని ఎప్పుడు ఓడనివ్వరు. ఆయన ఆశయాల్లో సాధనంగా మారుదాం. మార్పు మనలోనే మనతోనే మనమే అయ్యేలా ముందుకు వెళ్దాం.

              ఇవి కేవలం శ్రీ పవన్ కళ్యాణ్ గారి మీద గల నాలోని భావాలు. ఇవి ఎవరి మనోభావాలను అయిన బాధించితే మన్నింపబడును గాక. జై జనసేన, జై హింద్…!   

By

కొన్నిపాటి రవి 

ట్విట్టర్ ఐడి : @KPR_India

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way