శ్రీకాళహస్తి, (జనస్వరం) : ఇళ్ళ నిర్మాణాల్లో అవకతవకలు ఉంటే నిరూపించాలని పవన్ కళ్యాణ్ కి ఓపెన్ ఛాలెంజ్ విసిరిన శ్రీకాళహస్తి ఎమ్మెల్యే, ఛాలెంజ్ స్వీకరించి మోసాన్ని నిరూపిస్తామని ఈరోజు చర్చకు సిద్ధం అన్న శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన ఇంఛార్జి వినుత కోటా దమ్ముగా ఛాలెంజ్ ను ఎదుర్కోలేక శ్రీకాళహస్తి ఎమ్మెల్యే దొడ్డి దారిన పోలీసులను అడ్డు పెట్టుకుని మమ్మల్ని ఛాలెంజ్ కి రాకుండా ఆపాలని ప్రయత్నించడం ఎమ్మెల్యే అసమర్థకు, అధైర్యానికి నిదర్శనం అని తెలిపారు. ఛాలెంజ్ ఎదుర్కోవడానికి దమ్ము, ధైర్యం లేనపుడు విసరడం ఎందుకు! రాష్ట్రంలో సెక్షన్ 30 యాక్ట్ కేవలం జనసేన పార్టీకి మాత్రమేనా! అని ప్రశ్నించారు.