నెల్లూరు ( జనస్వరం ) : వైసిపీ ప్రభుత్వం రేషన్ షాపులు తీసేసి రేషన్ బండ్లు పెట్టిన వద్ద నుంచి పేదలకు రేషన్ ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూపులు చూడాల్సిన పరిస్థితి ఉంది…? అని వాపోయిన పేదలతో జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ మాట్లాడారు. నెల్లూరు రూరల్ 30వ డివిజన్ వైయస్సార్ నదుల నగర్లో త్రాగునీరు మరియు మౌలిక సదుపాయాలు లేమి తో ప్రజలు అల్లాడుతున్నాను అని ఫిర్యాదు అనంతరం.. అధికారులు స్పందించి ఈరోజు దాదాపు 50 మంది సానిటరి వర్కర్లను పంపించి పనులు ప్రారంభించి ముందడుగు వేసినందుకు వారికి ముందుగా అభినందనలు తెలుపారు. ఇక్కడ పనిచేసినట్లు వాళ్లు సంతకం అడుగగా.. 50 మంది శానిటరీ శానిటరీ వర్కర్లతో తీరే సమస్య కాదని ప్రాంతమంతా చెత్తా చెదారంతో నిండిపోయిందని అధికారులు చొరవ తీసుకొని సైడ్ కాలువలు ఏర్పాట్లకు మంచినీటి వసతి కలపనకు రోడ్ల నిర్మాణం కు చొరవ తీసుకోవాలని ఈరోజు జిల్లా ప్రధాన గునుకుల కిషోర్ తెలిపారు అదే విషయాన్ని వారు రాసుకొచ్చిన పత్రం పై రాసి సంతకం పెట్టారు. అనంతరం స్థానిక స్థానికంగా ఉన్న ప్రజలను కలవగా అనేక సమస్యలు తెలిపారు. తాగునీరు అందుబాటులో లేకపోవడంలో ట్యాంకర్ల ద్వారా అందిస్తున్న నీరు వారం రోజులకి పది రోజులకు ఒకసారి మాత్రమే వస్తుందని తెలిపారు. మల్లయ్యగుంట ప్రాంతంలో అయితే నీటికి ట్యాంకర్ ను చూసి దాదాపుగా రెండు సంవత్సరాలు అవుతుందని తెలిపారు. వెంటనే స్థానిక కాంట్రాక్టర్ల ట్రాక్టర్లతో తోలుతున్న వాటర్ ట్యాంకర్ల వారికి ఫోన్ చేసి ఆ ప్రాంతానికి ప్రతి రోజు నీటి సరఫరా చేయాల్సినదిగా కోరగా… ప్రభుత్వం నుంచి చేసిన పనులకి ఫండ్స్ సకాలంలో రాకపోయినా కూడా మేము సేవ కొనసాగిస్తున్నామని కచ్చితంగా ఆయా ప్రాంతాలకు ప్రతిరోజు నీరు అందే విదంగా చర్యలు చేపడతామని తెలిపారు. స్థానికులు మాట్లాడుతూ రేషన్ షాపులు తీసేసి రేషన్ బండ్లు ఏర్పాటు చేసిన తర్వాత అవి ఎప్పుడు వస్తాయో అని ఎదురుచూపులు చూడవలసి వస్తుంది. ఇళ్ళ దగ్గరకు రావాల్సిన రేషన్ బండ్లు నాలుగు సందులు అవతల ఉంటాయి.అదికూడా సమాచారం ఉండవు, ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూసుకోవాల్సిన పరిస్థితి. ఒకవేళ మేము వెళ్లడం లేట్ అయితే బియ్యం అయిపోయిందని నెక్స్ట్ మంత్ ఆ కోటా ఇక రాదు అని తెలుపారు. నిర్లక్ష్యానికి గురైన వైయస్సార్ నగర ప్రజలను, వారి ఇబ్బందులను ప్రభుత్వం తెలియజేసి సమస్య సాధనకు తోడుగా ఉంటామని హమీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్,కార్యదర్శి ప్రశాంత్ గౌడ్,30వ డివిజన్ ఇంచార్జ్ కరీం,నగర కార్యదర్శి కృష్ణవేణి,రూరల్ నాయకులుశ్రీను, ఖలీల్,షాజహాన్,వర్షన్ తదితరులు పాల్గొన్నారు.