విశాఖపట్నం, (జనస్వరం) : ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ గారి స్పూర్తితో జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయానికై పేద ప్రజల ఆకలి నింపే ప్రయత్నంగా "ఆకలితో ఉన్న వారికి భోజనం" అనే కార్యక్రమాన్ని PJAR చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గోపాలపట్నం రైల్వే స్టేషన్ నందు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అలాగే శ్రీ శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి భక్తులకు ప్రతి శనివారం నిత్య అన్నదానం చేయడం జరుగుతుందని ట్రస్ట్ సభ్యులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విశాఖ పశ్చిమ జనాసేన నాయకులు శ్రీ పెతకంశెట్టి శ్యామ్ సుధాకర్ మరియు జనసైనికులు ప్రకాష్, బంగార్రాజు, మైఖెల్, ప్రేమ్, చింటు మరియు ట్రస్ట్ సభ్యులు మాలిక్ తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com