Logo
Date of Publish : 24 August 2021, 5:18 pm
Editor : Sake Naresh

కొత్తపేట నియోజక వర్గ ఇంఛార్జ్ బండారు శ్రీనివాస్ గారి ఆధ్వర్యములో జనసేన పార్టీలోకి చేరిన వానపల్లి గ్రామ ప్రజలు

        కొత్తపేట, (జనస్వరం) :  అధికారం లేకపోయినా, జనసేనాని ఆశయాలు నచ్చి, జనసేన పార్టీకి అండగా నిలిచి, ఆత్మీయతను పంచిన వానపల్లి గ్రామ పెద్దలకు, యువకులకు ప్రత్యేక అభినందనలు తెలిపినా కొత్తపేట ఇంఛార్జ్ బండారు శ్రీనివాస్ గారు.  తూర్పు గోదావరి జిల్లా, కొత్తపేట నియోజక వర్గం, ప్రముఖ నాయకులు, జనసేన ఇంఛార్జ్  బండారు శ్రీనివాస్  గారు మాట్లాడుతూ, కొత్తపేట నియోజకవర్గంలో జనసేన పార్టీ, ఎంతో బలోపేతం అయిందని, రాష్ట్రములో  జనసేన పార్టీ అధినేత  పవన్ కళ్యాణ్ గారి  ఆశయాలు, ఆలోచనలు, దయాగుణం మానవత్వం కలిగిన మనసున్న మారాజుగా, ప్రజల హృదయాలను గెలుచుకుంటున్నారని, ఓటమి గెలుపు ఎలాంటి వ్యక్తికైనా ఉంటాయని, ఓడినా, గెలిచినా, ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండే గొప్ప నాయకుడు, జనసేన అధినేత అని, మచ్చలేని నాయకుడుగా, అవినీతి మరక లేని నాయకుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు అని అన్నారు.జనసేన పార్టీలోకి  చేరడానికి ముందుకు వచ్చిన, వానపల్లి గ్రామ పెద్దలకు,యువకులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని, ఆయన అన్నారు. జనసేన పార్టీకి వానపల్లి గ్రామం నుంచి సేవలందించడానికి, బీసీ సోదరులు, ఎస్సీ సోదరులు, ఓసి సోదరులు అధిక సంఖ్యలో రావడం ఎంతో శుభ పరిణామమని, మీ అందరి అభిమానం వెలకట్టలేనిది, జనసేన పార్టీ అందరి పార్టీ అని, జనసేనాని అందరి వాడు అని, జనసేన పార్టీ ప్రతి ఒక్కరిని ఆదరించే పార్టీ అని, ప్రతి ఒక్కరి సేవలను తప్పక గుర్తు పెట్టుకుంటామని, ఈ సందర్భంగా బండారు శ్రీనివాస్  గారు తెలియజేశారు. ఈ కార్యక్రమములో జనసేన నాయకులు, వానపల్లి గ్రామ ప్రజలు తదితురులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com