గుంటూరు ( జనస్వరం ) : నాటి బ్రిటీష్ పాలకుల కన్నా ఘోరంగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి నేతృత్వంలో నియంత పాలన సాగుతుందని , రాష్ట్ర శ్రేయస్సు , ముందుతరాల వారి భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకొని రాష్ట్రంలో వైసీపీ పాలన నుంచి రాష్ట్రాన్ని విముక్తి చేసేందుకు మరో స్వాతంత్ర్య పోరాటానికి ప్రజలు సిద్ధమయ్యాలని జనసేన పార్టీ నగర అధ్యక్షుడు నేరేళ్ళ సురేష్ అన్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా 22 వ డివిజన్ అధ్యక్షుడు సయ్యద్ షర్ఫుద్దీన్ ఆధ్వర్యంలో శ్రీనివాసరావుతోటలో జాతీయ జెండాని ఆయన ఆవిష్కరించారు. అదేవిధంగా నగరంలోని గోరంట్ల , యల్లార్ కాలనీ , కొండలరావు నగర్ , పాత గుంటూరు ప్రాంతాల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నేరేళ్ళ సురేష్ మాట్లాడుతూ ఎందరో మహానుభావుల ప్రాణ త్యాగ ఫలమైన స్వాతంత్ర్య ఫలాలు క్షేత్రస్థాయిలో ప్రజలకు అందేలా కృషిచేయాలన్నారు. ఆడపిల్లలు అర్ధరాత్రి కూడా స్వేచ్ఛగా నడయాడినప్పుడే నిజమైన స్వాతంత్య్రం వచ్చినట్లు అన్న మహాత్మాగాంధీ కన్న కలలు ఇప్పటికీ కల్లలుగానే మిగిలిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేకించి రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలను , దాష్టీకాలనూ చూస్తే ఇటువంటి ప్రజా కంఠక పాలన కోసమా మేము ప్రాణాలకు తెగించి పోరాడింది అని స్వాతంత్ర్య సంగ్రామ వీరులు బాధపడతారన్నారు. జగన్ రెడ్డి ఆరాచాకలకు అడ్డుకట్ట వేయాలి అంటే జనసేన పార్టీకి ప్రజలు అండగా నిలవాలని కోరారు. తొలుత మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ళ హరి, నగర కమిటీ ఉపాదక్ష్యుడు చింతా రాజు , ప్రధాన కార్యదర్శిలు యడ్ల నాగమల్లేశ్వరరావు, సూరిశెట్టి ఉదయ్, బండారు రవీంద్ర, నాగరాజు, డివిజన్ అధ్యక్షులు, రఫీ, కామేష్, వడ్డె సుబ్బారావు, కోలా అంజి, చిరంజీవి, సంజీవ్, బాలకృష్ణ, పుష్ప, తాడివాక రమణ, సుభాని, చంటి, తాడికొండ శ్రీను, బాలాజీ, తేజ, కుమార స్వామి, ఆది నారాయణ, పసుపులేటి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com