మదనపల్లి ( జనస్వరం ) : జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండటాన్ని రాష్ట్ర ప్రజలు సిగ్గుపడాల్సిన విషయం అని మదనపల్లి కమ్మవీధి జనసేన పార్టీ కార్యాలయం లో ప్రెస్ మీట్ లో జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్ గంగరపు రామదాస్ చౌదరి అన్నారు. మధ్యప్రదేశ్ లో ఒక వ్యక్తి మీద ఒక ఉన్మాది మూత్ర విసర్జన చేస్తే ఆ రాష్త్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ అతని పిలిచి నా పాలనలో ఇలాంటి సంఘటన జరగడం బాధాకరం అని అతని కాళ్ళు కడిగి క్షమించమని అడగటం ఎంతో ఔనథ్యానికి నిదర్శనం అని అన్నారు. జగన్మోహన్ రెడ్డి కి తలకాయలో గుజ్జు తప్ప మెదడు లేదు కనీసం పక్క రాష్ట్రల ముఖ్యమంత్రిలను చూసి నేర్చుకోవాలి. ప్రకాశం జిల్లా ఒంగోలులో ఒక దళితుడు పైన నలుగురు సామూహికంగా మూత్రవిసర్జన చేస్తే కనీసం నువ్వు ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదని దీన్ని జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తాందని అన్నారు. వైసీపీ వాళ్ళు ఏ కార్యక్రమం చేసిన పవన్ కళ్యాణ్ వ్యక్తి గత జీవితం పైన విమర్శలు చేస్తున్నారు ఇలా చేయడం మంచి పద్ధతి కాదని అన్నారు.