పాడేరు ( జనస్వరం ) : కొత్తాపాలెం పంచాయితీ మరియు గ్రామంలో జనసేనపార్టీలో భారీ చేరికలు జరిగాయి. స్థానిక గ్రామస్తులతో జనసేనపార్టీ నాయకులు సమావేశమయ్యారు. వారితో నేరుగా గిరిజన ప్రజల సమస్యలు ప్రస్తుత ప్రభుత్వ తీరుపై జనసేనపార్టీ పాడేరు సమన్వయకర్త డా..వంపూరు గంగులయ్య స్పందిస్తూ గడిచిన 4 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని దివాళా తీసేటటువంటి పాలనతో అస్తవ్యస్తం చేశారు. ఇప్పుడు మళ్లీ జగనన్న రావాలి అతని దోపిడీ మాకు ముద్దు, మాకు ఏ అభివృద్ధి వద్దు అంటూ ఊరూర మన ఎమ్మెల్యేలు డప్పుకొట్టుకుంటు ప్రచారం చేస్తున్నారు. తస్మాత్ గిరిజన ప్రజలారా ఇటువంటి దోపిడీ ప్రభుత్వాన్ని నమ్మి ఇంకో తప్పుచెయ్యవద్దు మన గిరిజన ప్రజల విషయానికొస్తే అనేక రకాలుగా మోసం చేశారు. ఇప్పటికి చేస్తూనే ఉన్నారు. ఏటా జాబ్ క్యాలెండర్ అన్నారు ఏది లేదు, గ్రామసీమల మౌళికాభివృద్ది సదుపాయాల ఊసే లేదు. పంచాయితీ నిధులు హుష్ కాకి, మన సహజ సంపదలు కడప మైనింగ్ కంపెనీలకు ధారాదత్తం,మన గ్రామసభ తీర్మానాలు 1/70పేసా హక్కులు ఉల్లంఘన, గిరిజన నిరుద్యోగులకు కల్పతరువు లాంటి జీవో నెం3 రద్దు చేసి గిరిజన నిరుద్యోగ అభ్యర్థుల పొట్టగొట్టడమే కాకుండా ప్రజలకి సైతం ఇది ఇస్తున్నాం, అది ఇస్తున్నాం అంటూ మభ్యపెట్టే అనేకరకమైన మోసపూరిత ప్రకటనలు చేస్తున్నారు .ఈ సమావేశంలో జనసేనపార్టీ సిద్ధాంతాలు లక్ష్యాలు, గిరిజన సాధికారతపై పవన్ కళ్యాణ్ గారికి ఉన్న దృష్టి నచ్చి కొత్తపాలెం గ్రామ ప్రజలు స్వచ్ఛందంగా పార్టీ లోకి చేరారు వారికి జనసేనపార్టీ సమన్వయకర్త డా..గంగులయ్య, ఉల్లి సీతారామ్ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. పాడేరు నియోజకవర్గ ఐటి ఇన్చార్జ్ సాలేబు అశోక్, జి.మాడుగుల మండల అధ్యక్షులు మసాడి భీమన్న, కార్యనిర్వాహక కమిటీ సభ్యులు తాంగుల రమేష్, లీగల్ అడ్వైజర్ కిల్లో రాజన్, చింతపల్లి మండల అధ్యక్షులు వంతల బుజ్జిబాబు, మండల నాయకులు ఉల్లి సీతారామ్, శ్రీను, రాజబాబు, తదితర జనసైనికులు కొత్తపాలెం గ్రామస్తులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com