పాడేరు ( జనస్వరం ) : జి.మాడుగుల మండలం వంతల పంచాయితీ, కర్జపల్లిగ్రామంలో లీగల్ అడ్వైజర్ కిల్లో రాజన్ ఆధ్వర్యంలో జి.మాడుగుల మండల నాయకులు మండల అధ్యక్షులు మసాడి భీమన్న, కార్యనిర్వహక కమిటీ సభ్యులు తాంగుల రమేష్, బూత్ కన్వీనర్ కొర్ర భాను ప్రసాద్ కార్యనిర్వాహక మండల అధ్యక్షులు, మసాడి సింహాచలం, గ్రామ పర్యటన చేశారు. గ్రామంలోని త్రాగునీరు ప్రధాన సమస్యలు మరియు పాఠశాల, అంగన్వాడి బిల్డింగ్, సిసి రోడ్లు డ్రైనేజీలు, మరియు ప్రభుత్వం నుంచి ఒక్క ఇల్లు కూడా సాంక్షన్ చేయకపోవడం వంటివి అనేక సమస్యలు ఆ గ్రామంలో ఉన్నాయని గుర్తించారు. ఈ సందర్బంగా స్థానిక గ్రామస్తులతో సమావేశమై మనపాడేరు ఎమ్మెల్యే గడపగడపకు వెళ్ళినప్పటికీ కూడా ఇచ్చిన హామీలు ఒక్కటంటే ఒక్కటి కూడా నెరవేర్చలేదు, త్రాగడానికి మంచినీటి కోసం ప్రతిరోజు ఒక మైలు దూరం వెళ్తున్నామని అన్నారు. ఈ వైసీపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయాన్ని పసిగట్టి విసిగిపోయం అందుకే జనసేన పార్టీ నాయకులను పిలిచాము మా యువత జనసేన పార్టీ సిద్ధాంతాలను పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను మాకు వివరించారు. అందుకే మేము పార్టీలో చేరాలనుకుంటుమన్నారు. జనసేనపార్టీ పార్టీలో గ్రామ ప్రజలంతా చేరడం జరిగింది, జనసేన పార్టీ ద్వారానే మా గ్రామ అభివృద్ధి జరుగుతుందని దృఢంగా నమ్ముతున్నామని గ్రామస్తులు తెలియజేశారు. మా సమస్యలపై పోరాటం చేయడానికి ముందుకొచ్చిన జనసేన పార్టీ నాయకులను తప్పకుండా మా గ్రామం తరపున రుణపడి ఉంటామని గ్రామస్తులన్నారు. మొట్టమొదటిసారిగా మా సమస్యలను తెలుసుకొని మా గ్రామానికి వచ్చిన పార్టీ జనసేన పార్టీయన్నారు అందుకే జనసేన పార్టీని ఆదుకుంటామని మేమంతా పార్టీకి అండగా ఉంటామని తెలియజేశారు ఇందుకు జనసేనపార్టీ నాయకులు స్పందిస్తూ ఏ గ్రామానికి వెళ్లిన అభ్యుదయబావాలున్నా యువకులున్నారని వారంతా గిరిజన రాజకీయ స్థితిగతులపై అవగాహన కలిగివున్నారన్నారు. అనేకరంగాల్లో పవన్ కళ్యాణ్ గారు తీసుకోబోయే సంస్కరణల విషయమై పూర్తినమ్మకం పెట్టుకున్నారన్నారు అలాగే రైతులకు అనేక విషయాల్లో మంచి ఆలోచన చేసియున్నారన్నారు. మీరంతా యువతకు జనసేనపార్టీ కి అండగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో జి.మాడుగుల మండల అధ్యక్షులు మసాడి భీమన్న, కార్యనిర్వాహక కమిటీ సభ్యులు తాంగుల రమేష్, మసాడి సింహాచలం. బూత్ కన్వీనర్ కొర్ర భానుప్రసాద్ గ్రామస్తులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com