
గుడివాడ ( జనస్వరం ) : కృష్ణాజిల్లా గుడివాడ పట్టణ బస్టాండ్ రైల్వే స్టేషన్ ఏరియాలో పేదవారికి మరియు యాచకులకు ఆకలితో ఉన్న అనార్థులకు ఆహారం అందజేసి ఆకలి తీర్చిన గుడివాడ పట్టణ జన సైనికులు. ఈ సందర్భంగా గుడివాడ పట్టణ జనసేన నాయకులు డాక్టర్ మాచర్ల రామకృష్ణ మాట్లాడుతూ అన్నం పరబ్రహ్మ స్వరూపమని అలాంటి ఆహారాన్ని ఆకలితో ఉన్న అనార్థులకు అందజేయడమే మా లక్ష్యమని గుడివాడ పట్టణంలో ఆకలి చావులు ఉండకూడదని ఆలోచనతో పేదవారికి యాచకులకు ఆంధ్రుల అన్నపూర్ణ శ్రీమతి డొక్కా సీతమ్మ గారి ఆశీస్సులతో జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో ఆహారం అందజేయడం జరుగుతుందని తెలియజేశారు. అలాగే మా తమ్ముడు గంట ఆంజనేయులు వారి సోదరి జ్ఞాపకార్థం ఆహారం అందజేయడంతో గుడివాడ పట్టణంలో అన్నదానం చేయడం జరిగింది. అదేవిధంగా గుడివాడ పట్టణంలో ఉన్న ప్రజలు మీ పెళ్లి రోజు గాని మీ పుట్టినరోజులు గాని మీ పేరు మీద పదిమంది ఆకలి తీర్చాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు నూనె అయ్యప్ప, చరణ్” సురేష్, ముస్లిం మైనారిటీ నాయకులు షేక్ మీరా షరీఫ్ గారు, పాల్గొన్నారు.