Logo
Date of Publish : 13 February 2023, 4:12 pm
Editor : Sake Naresh

అనాధ వృద్ధ తల్లి మృతదేహానికి అంతక్రియలు చేసి మానవత్వాన్ని చాటిన గుడివాడ పట్టణ జనసైనికులు

       గుడివాడ ( జనస్వరం ) :  గుడివాడ పట్టణంలో పోస్ట్ ఆఫీస్ రోడ్ లో గత కొంతకాలంగా భిక్షాటన చేసుకుంటూ జీవిస్తున్న ఒక వృద్ధతల్లి రాత్రి అనారోగ్యంతో చనిపోవడంతో అక్కడ ఉన్న స్థానికులు గుడివాడ పట్టణ జన సైనికులకు తెలియజేయగా పోలీస్ వారికి సమాచారం తెలియజేసి ఆ వృద్ధ తల్లి అంతిమ సంస్కారాలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా గుడివాడ పట్టణ జనసేన నాయకులు మాచర్ల రామకృష్ణ(Rk) మాట్లాడుతూ మానవ సేవ అనే నినాదంతో గుడివాడ పట్టణంలో నా అనే వాళ్లు లేక అనాథులుగా చనిపోవడంతో ఆ మృతదేహాలకు అన్ని మేమే అంత్యక్రియలు చేస్తున్నామని, అదేవిధంగా ఈరోజు మహిళా దినోత్సవం నాడు ఒక వృద్ధతల్లిని అనాదిగా అంతక్రియలు చేయడం చాలా బాధాకర విషయం అని అన్నారు. ఆ తల్లి ఎక్కడ పుట్టిందో ఎక్కడ పెరిగిందో తెలియదు కానీ మేము ఆ తల్లికి ఒక కొడుకు లాగా ఈ కార్యక్రమం చేయడం జరిగిందని, మనం పుట్టినప్పుడు ఎంత పవిత్రంగా పుడతామో అదే చివరి దశలో తనువు చాలించినప్పుడు అదే పవిత్రంగా ఉండాలని ఆలోచనతో ఇలాంటి కార్యక్రమాలు చేసి వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని కోరుకుంటున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి నాకు తోడుగా ఉంటున్న నా టీం సభ్యులకు మరియు పోలీసు వారికి నా హృదయపూర్వక ధన్యవాదములు అని తెలియజేసినారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు అయ్యప్ప, చరణ్, సురేష్, మరియు జనసైనికులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com