Logo
Date of Publish : 11 September 2023, 10:26 pm
Editor : Sake Naresh

వర్షంలో మోకాలు మీద నిరసన కార్యక్రమం తెలియజేసిన గుడివాడ పట్టణ జనసైనికులు

     గుడివాడ ( జనస్వరం ) : కృష్ణాజిల్లా గుడివాడ పట్టణ స్థానిక పెదఎరుకపాడు వార్డులో గుంతలమయంతో ఉన్న రోడ్లు మరియు పిల్లల పార్కు, వీధిలైట్లు సమస్యల మీద నిరసన కార్యక్రమం తెలియజేసి మున్సిపల్ అధికారులకు స్పందన కార్యక్రమంలో వినతి పత్రం అందజేసిన వార్డు ప్రజలు మరియు గుడివాడ పట్టణ జనసైనికులు. ఈ సందర్భంగా గుడివాడ పట్టణ జనసేన నాయకులు డాక్టర్ మాచర్ల రామకృష్ణ(Rk) మాట్లాడుతూ గుడివాడ పట్టణ స్థానిక పెదఎరుకపాడు వార్డులో రోడ్లు గుంతల మయం కావడంతో అక్కడ ఉన్న స్థానికులు, వాహనాదారులు, స్కూలు పిల్లలు, ఆ రోడ్లో వెళ్లాలంటే ఇబ్బంది పడుతున్నారని అన్నారు. ఆ రోడ్లో వీధిలైట్లు లేకపోవడం వల్ల ప్రజలు వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని ఎన్నిసార్లు ఈ రోడ్డు సమస్య మీద నిరసన కార్యక్రమాలు చేసిన పట్టించుకునే నాధుడే లేరని మా గ్రామానికి కొత్త రోడ్డు వేయకపోయినా పర్లేదు గాని కనీసం ఒక ట్రక్కు మట్టి కూడా వెయ్యలేకపోవడం చాలా దౌర్భాగ్యం అని ఆరోపణ చేశారు. దయచేసి గుడివాడ పట్టణ మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి ఈ సమస్యలను తీర్చాలని వార్డ్ ప్రజలు తరఫున స్పందన కార్యక్రమంలో మున్సిపల్ అధికారులకు తెలియజేయడంతో వెంటనే స్పందించి కమిషనర్ గారు ఆ రోడ్డుని మరమ్మత్తులు చేపిస్తానని హామీ ఇవ్వడం జరిగిందని తెలియజేశారు. జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో సమస్య ఎక్కడ ఉంటే అక్కడ జనసేన పార్టీ ఉంటు ప్రజల సమస్యల మీద పోరాడుతూ ఉంటారని అన్నారు. ప్రశ్నించేవాడు లేకపోతే బెదిరించే వాడిదే రాజ్యం అవుతుందని మా నాయకుడు నేర్పిన సిద్ధాంతంతో గుడివాడ పట్టణంలో అనేక సమస్యల మీద పోరాడుతున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ముస్లిం మైనార్టీ నాయకులు షేక్ మీరా షరీఫ్ గారు నూనె అయ్యప్ప, దివిలి సురేష్, పందిళ్ళ శీను, గంట అంజి, చరణ్ తేజ్, శివ, చరణ్, మరియు వార్డు ప్రజలు పాల్గొన్నారు


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com