గుడివాడ ( జనస్వరం ) : కన్న కూతురు చనిపోవడంతో ఒంటరి అయిన అవ్వ.. ఆ అవ్వ పూర్తి బాధ్యత తీసుకుని ఆశ్రమంలో చేర్చడం జరిగింది. ఈ సందర్భంగా గుడివాడ పట్టణ జనసేన నాయకులు డాక్టర్ మాచర్ల రామకృష్ణ(Rk) మాట్లాడుతూ మానవసేవయే మాధవసేవ అనే నినాదంతో గుడివాడ పట్టణంలో అనేక సేవా కార్యక్రమలు చేస్తున్న మమ్మల్ని అక్కడ ఉన్న స్థానికులు ఆ ఒంటరిగా ఉన్న అవ్వ గురించి సమాచారం అందజేయగా వెంటనే స్పందించి ఆ అవ్వ పూర్తి బాధ్యత తీసుకుని ఆశ్రమంలో చేర్పించడం జరిగింది. అదేవిధంగా కన్న"తల్లిదండ్రులకు" పట్టెడు"అన్నం"పెట్టడం బరువు అనుకుంటే మాకు అప్పగించండి. వారికి నీడ ఏర్పాటు చేసి ఆకలి బాధ పడకుండా కడవరకు తోడుంటాం..అని అదేవిధంగా సృష్టిలో దైవం అమ్మానాన్నలు అని వారికి ఏ ఇబ్బంది లేకుండా చూసుకోవాలని తెలియజేసినారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ముస్లిం మైనార్టీ నాయకులు షేక్ మీరా షరీఫ్ గారు, నూనె అయ్యప్ప, దివిలి సురేష్, గంట అంజి, చరణ్ తేజ్, పందిళ్ళ శీను, మరియు జనసైనికులు పాల్గొన్నారు
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com