Logo
Date of Publish : 21 December 2023, 7:58 pm
Editor : Sake Naresh

జనసేన పార్టీకి ఒక్క అవకాశం ఇస్తామంటున్న 24వ డివిజన్ వడ్డు పాలెం ప్రజానీకం

 ఒంగోలు ( జనస్వరం ) :  నగర జనసేన పార్టీ కార్యదర్శి గోవింద్ కోమలి గారి ఆధ్వర్యంలో ప్రజా సమస్యలను తెలుసుకోవడంలో భాగంగా 67వ రోజు జనచైతన్య యాత్ర లో భాగంగా ఒంగోలులోని 24వ డివిజన్ గంటపాలెం దగ్గర వడ్డెపాలెం లో పర్యటించి ప్రజలతో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా స్థానిక ప్రజానీకం జనసేన నాయకులతో మాట్లాడుతూ ఈ జగన్ రెడ్డి ప్రభుత్వంలో పెరిగిన ధరలతో మేము జీవనం సాగించడం చాలా కష్టంగా మారిందని అన్నారు. ప్రజల ఆదాయం పెరగలేదు కానీ కుటుంబ పోషణ ఖర్చు మాత్రం పెరిగిందని, ఇప్పటిదాకా అందరికీ ఒక అవకాశం ఇచ్చామని మాకు ఎవరూ చేసింది ఏమీ లేదని అన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు తాను అధికారంలోకి వస్తే ఏమి చేస్తారో చెప్పిన విధానం మమ్మల్ని బాగా ఆలోచింప చేసిందని అలాంటి నాయకుడికి ఈసారి అండగా నిలుస్తామని అన్నారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి సారధ్యంలో ఏర్పాటు కాబోయే ప్రభుత్వంలో మన ప్రాంత అభివృద్ధికి కచ్చితంగా పాటుపడతామని, కీలకమైన సమస్యలను అధికారంలోకి వచ్చిన వెంటనే తీర్చేలా ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కళ్యాణ్ ముత్యాల, ఒంగోలు నగర జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శులు ఆర్ కె నాయుడు ముత్యాల, పల్ల ప్రమీల, ఒంగోలు నగర జనసేన పార్టీ కార్యదర్శి గోవింద్ కోమలి, ఒంగోలు నగర జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శులు పోకల హనుమంతురావు, ఆకుపాటి ఉష, 28వ డివిజన్ అధ్యక్షులు కోట సుధీర్ మరియు వీర మహిళ మాదాసు సాయి నాయుడు, జనసేన నాయకులు అరవింద్ బాబు ముత్యాల, బాయ్రెడ్డి వేణు, చెన్ను నరేష్, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com