Logo
Date of Publish : 01 December 2023, 10:05 pm
Editor : Sake Naresh

జనసేన పార్టీకి ఒక అవకాశం ఇస్తామంటున్నా 12వ డివిజన్ ప్రజానీకం

  ఒంగోలు ( జనస్వరం ) :  ఒంగోలులోని రంగు తోట శివాజీ బొమ్మ ప్రాంతం లో 12వ డివిజన్ అధ్యక్షులు అనిల్ కుమార్ కటకంశెట్టి  ఆధ్వర్యంలో పర్యటించారు. ప్రజలతో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్బంగా జనసేన నాయకులతో వివిధ వర్గాల ప్రజలు మాట్లాడుతూ ఇప్పటిదాకా అందరికీ ఒక అవకాశం ఇచ్చామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి కూడా ఈసారి ఒక అవకాశం ఇస్తామని అన్నారు. ఆయన చేసిన కార్యక్రమాలు మమ్మల్ని ప్రభావితం చేశాయని, ఆయన సారథ్యం లో తప్పకుండా రాబోయే రోజుల్లో ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అన్నారు. యువతకు ఉపాధి రావాలన్నా, రైతన్నకు అండగా నిలవాలన్నా, మహిళలకు రక్షణ ఉండాలన్న, బడుగు బలహీన వర్గాలు అభివృద్ధి చెందాలన్న అది పవన్ కళ్యాణ్  పాలనలోనే సాధ్యమవుతుందని అన్నారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ తప్పకుండా ప్రజా సమస్యల పరిష్కారానికి నిత్యం పోరాటం చేస్తూనే ఉంటామని, బడుగు బలహీన వర్గాలకు అండగా జనసేన పార్టీ ఎప్పుడు ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి కళ్యాణ్ ముత్యాల, ఒంగోలు నగర జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి పల్ల ప్రమీల, ఒంగోలు నగర జనసేన పార్టీ కార్యదర్శులు గోవింద్ కోమలి, ఒంగోలు నగర జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి ఆకుపాటి ఉష,28వ డివిజన్ అధ్యక్షులు కోట సుధీర్, మరియు జనసేన నాయకులు అరవింద్ బాబు ముత్యాల, బాయ్రెడ్డి వేణు,సుధాకర్ పసుపులేటి, బన్నీ, అవినాష్ పర్చూరి, సాయి, నవీన్, రవీంద్ర, తదితరులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com