నెల్లూరు ( జనస్వరం ) : సహజ వనరులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది,గమనించిన కోవూరు పరిధిలోనే విచ్చలవిడిగా ఇసుక, గ్రావెల్, మట్టి తవ్వి తరలిస్తున్నారు. గతంలో వచ్చిన వరదల వల్ల ఎన్నో గ్రామాలు మునక కు గురి అయ్యాయని నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ అన్నారు. ఎవరిని ప్రశ్నించినా కూడా తమ పరిధిలో లేదని తప్పించుకునే ప్రయత్నం చేస్తూ,స్థానిక నాయకులు వత్తాసు పలుకుతున్నారే కానీ ఎవరు సహకరించి చర్యలు తీసుకుని కట్టడి చేసిన పరిస్థితి కనబడడం లేదు.అధికారులు తలుచుకుంటే సాధించని పని ఏమీ లేదు.ప్రత్యక్ష సాక్షాలు కల్ల ఎదురుగా ఉంటే వాటిని తవ్విన వారెవరో కనిపెట్టడం పెద్ద పనేమీ కాదు. ఈ విషయమై ఒక సర్పంచ్ పోరాటం చేస్తే అతనిపై అక్రమ కేసులు బనాయించారు. గతంలో వచ్చిన వరద వల్ల మా ఊరు మునిగిపోయి కనీసం అన్నం పెట్టే దిక్కు కూడా లేరు. మేము ఎవరికి చెప్పుకోవాలని సర్పంచులు వాపోతున్నారు. గ్రామ సర్పంచులు అధికారాలను నిర్వీర్యం చేస్తూ రావలసిన నిధులు రాకుండా గాంధీజీ గాంధీజీ కలలు కన్నా గ్రామ స్వరాజ్యాన్ని దూరం చేస్తున్న ఈ నాయకత్వాన్ని తరిమికొట్టాలి. పై పెచ్చుతవ్వుకుంటే నష్టం ఏమిటి అని కొంతమంది అధికారులు అడుగుతున్నారు. గ్రామాల్లో దొరికే ఇసుక గ్రావెల్ మట్టి అక్రమంగా తవ్వి కనీసం రెవిన్యూ కూడా గ్రామాలకు ఇవ్వకుండా రాకపోకలతో రాక పోకలకి ఉన్న దారులను అస్తవ్యస్తం అవుతున్నాయి. గ్రీన్ ట్రిబ్యులర్ మరియు సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం 110 ఇసుకరీచుల తవ్వకాలు ఆపేయమని ఆదేశాలు ఉండగా, యదేచ్చగా నిబంధనలు ఉల్లగిస్తూ అక్రమంగా తవ్వుకు తరలిస్తూనే ఉన్నారు. నేడు మనం చేస్తున్న తప్పులు భావితరాలకు శాపాలుగా మిగులుతాయి. మినగల్లు గ్రామంలో డంపింగ్ యార్డ్ బిల్లు చూపి ఇసుక రీచుల్లో ఇష్టం వచ్చినట్లు అడ్డగోలుగా తవ్వకాలు జరుపుతున్నారు .వీరిని అరికట్టేది ఎవరు ? సహజ వనరుల దోపిడీ అరికట్టాలి ఇకనైనా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించి ప్రకృతి వైపరీత్యాలకు గ్రామాలు బలికాకుండా చూడాల్సిన పరిస్థితి ఉంది. సహజ వనరులు కాపాడాలన్నా అక్రమమైనింగ్ ను అరికట్టాలన్నా ప్రజా ప్రభుత్వం జనసేన అధికారంలో వస్తేనే పవన్ కళ్యాణ్ గారి సారధ్యం లోనే వీరి ఆగడాలను ఆపగలం అనిపిస్తుంది. సహజ వనరుల ను కాపాడాల్సిన బాధ్యత ప్రతి పౌరుడికి ఉంది. స్థానికంగా ఉన్న గ్రామస్తులు వీటిని నిలదీయండి అండగా జనసేన పార్టీ ఉంటుంది గతంలో జరిగిన ప్రకృతి విపత్తులను తలుచుకొని అవి మరింత ఉధృతం కాకుండా చూడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరికీ ఉంది. మీ పారాటానికి మేము తోడుంటాం నిలబడి నవ సమాజ నిర్మాణానికి నడుం బిగించండని అన్నారు.