ఒంగోలు, (జనస్వరం) : ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు షేక్ రియాజ్ గారి ఆదేశాలు మేరకు ఒంగోలు నియోజకవర్గంలోని అల్లూరు పంచాయతీ చింతల వద్ద టిడ్కో గృహాలను జనసేన పార్టీ వీర మహిళ విభాగం ఆధ్వర్యంలో పరిశీలించడం జరిగింది. ఈ సందర్బంగా ప్రకాశం జిల్లా జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి అరుణ రాయపాటి మాట్లాడుతూ గత ప్రభుత్వం హయాంలో గృహలు ఇవ్వడం జరిగింది అని ఇప్పటివరకు వాళ్ళ కు ఇల్లు ఇవ్వలేదు అని ఇంకా ఇల్లు పూర్తి కాలేదు అని ఇప్పటికీ లబ్ధిదారులకు ఎటువంటి భరోసా ఏ ఒక్క అధికారి కూడా ఇవ్వలేదని ప్రతీ రోజు లబ్ధిదారులు ఆఫీస్ చుట్టూ అధికారులు చుట్టూ తిరుగుతున్నారని ఇప్పుడు ఈ టిడ్కో ఇల్లు చూస్తే ఏ ఒక్క ఇల్లు కూడా నివాసానికి యోగ్యంగా లేవుని ప్రభుత్వాలు కోట్లరూపాయలు ప్రభుత్వ ధనాన్ని వెచ్చించి 90 శాతం పూర్తి చేశారు కానీ నిరాశ్రయులుగా ఉన్నవారికి ఆశ్రమం ఇవ్వలేక పోయింది. జగన్మోహన్ రెడ్డి ఒక్క రూపాయికే ఇల్లు ఇస్తామని చెప్పి పూర్తి అయిన ఇళ్ళు ను ఇవ్వడం ఎందుకు ఆలస్యం? వైసీపీ, టీడీపీ నేతలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం తప్ప అభివృద్ధి కార్యక్రమాలు చేయడం లేదని, ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలి అని జనసేన పార్టీ తరుపున తీవ్రంగా ఖండిస్తున్నాము అని అన్నారు. ఇప్పటికీ అయిన లబ్ధిదారులకు ఇవ్వకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. అలాగే వీర మహిళ ప్రమీల మాట్లాడుతూ పేద ప్రజలకు వెంటనే గృహాలను పూర్తి చేసి అందజేయాలి అని డిమాండ్ చేశారు. లేని పక్షంలో జనసేన పార్టీ తరుపున పోరాటం చేస్తాము అని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు చిట్టెం ప్రసాద్, ప్రకాశం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శులు కళ్యాణ్ ముత్యాల, రాయని రమేష్, జనసేన పార్టీ రాష్ట్ర మత్స్యకార విభాగం కార్యదర్శి రాజు, కొత్తపట్నం మండలం ప్రెసిడెంట్ జానకి రామ్ మరియు జనసేన నాయకులు తోట శబరి, సుధాకర్ చంగలశెట్టి, నరేంద్ర పొకల, బొందిల మధు, తిరుమలశెట్టి నాని, భూపతి రమేష్, మాల్యాద్రి నాయుడు, పెర్నమిట్ట శ్రీనివాస్, హేమంత్ గంట, శ్రీనాధ్, సాయి కుమార్, జల్లిపల్లి వసంత్, జనసేన వీర మహిళలు కోసూరి శిరీష, ప్రమీల, కోమలి, ఉష, ఆకుపాటి ఉష, వాసుకి తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com