
యలమంచిలి ( జనస్వరం ) : జనసేన యలమంచిలి నియోజకవర్గం వీరమహిళ మోటూరు శ్రీవేణి ఆధ్వర్యంలో ” రోడ్డు వేశారు అంచులు పూడ్చడం మర్చిపోయారా?” అని జనసేన శ్రేణులతో కలసి నిరసన కార్యక్రమం చేపట్టారు. అదేవిధంగా రోడ్లు భవనాలు అధికారులు దృష్టికి కూడా సమస్యను తీసుకువెళ్ళారు. దాని ఫలితంగా నేడు మడుతూరు జంక్షన్ నుండి బెర్మ్ (అంచులు) పనులు జరుగుతున్నాయి అన్నారు. దీనికి ఆమె ఆనందం వ్యక్తం చేస్తూ నేటితో వాహాన చోదకులకు కష్టాలు తీరుతాయి అన్నారు. ఎటువంటి ప్రజా సమస్యలు ను అయినా సరే అధికారులు దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం చేయడానికి జనసేన పార్టీ తమ వంతు ప్రయత్నం చేస్తుంది అని ఆమె ఓ ప్రకటనలో తెలిపారు.