పత్తికొండ ( జనస్వరం ) : జనసేన పార్టీ నాయకులు సర్పంచ్ అభ్యర్థి, ఎంపిటిసి అభ్యర్థి, మద్దికేర మండలం నందు త్వరలో వైసీపీలోకి చేరిక, అని వచ్చిన తప్పుడు వార్తను జనసేన నాయకులు ఖండించారు. నియోజకవర్గ నాయకుడు సిజి రాజశేఖర్ మాట్లాడుతూ, మద్దికేరలో పోటీ చేసిన అభ్యర్థులు జెడ్పిటిసి అభ్యర్థి మార్ గుండు జయరాముడు, సర్పంచ్ అభ్యర్థి గద్దల రాజు, మద్దికేర టౌన్ నందు నాలుగుకి నాలుగు ఎంపీటీసీలుగా పోటీ చేసిన అభ్యర్థులు, 1వ ఎంపీటీసీగా, చిరంజీవి 2వ ఎంపీటీసీగా గద్దల అజయ్, 3వ ఎంపీటీసీగా,ఎంపీటీసీ వడ్ల కంబగిరి, 4వ, ఎంపీటీసీగా ఎంపీటీసీ తిమ్మప్ప, మద్దికేర టౌన్ నందు పోటీ చేసి ఎవరు ఎన్ని భయభ్రాంతులకు గురిచేసినా, ఎవరికి భయపడకుండా, ఎవరు ఎన్ని ఆశలు చూపిన ఎవరికి లొంగకుండా, చాలా నిజాయితీగా పోటీ చేసినారు. ఈరోజు జనసేన పార్టీ వీడుతున్నారు, అనేది ఆవాస్తవం. ఎలక్షన్ టైంలో వారు నిలబడిన తీరు అమోఘం, ఓటమి గెలుపును పక్కనపెడితే వీరందరూ పార్టీ బలపేతం కోసం, ఎంత కష్టపడ్డారో మాకు తెలుసు. ఎవరు ఎలాంటి తప్పుడు వార్తలు రాసిన మేము ఆదరం బెదరం, అని తెలియజేస్తున్నామని అన్నారు. పత్తికొండ నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు చాలా బలంగా ఉన్నారు మీ అందరికీ తెలియజేస్తున్నాం.
జనసేన ప్రజా పోరాట యాత్రలో నేను చూసిన వంటి అభిమానులు కార్యకర్తలు నాయకులు పార్టీ బలపేతం కోసం ఎలా కష్టపడుతున్నారు. ఇలాంటి వారిపై తప్పుడు ప్రచారాలు మానుకోవాలని తెలియజేస్తున్నాం, మద్దికేర మండలం నాయకులు మాట్లాడుతూ దయచేసి జనసేన పార్టీపై ఇలాంటి తప్పుడు ప్రచారాలు ఎవరు కూడా చేయొద్దని తెలియజేశారు. మద్దికేర మండలంలో జనసేన పార్టీ చాలా బలంగా ఉంది, మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారి, ఆశయాలు, సిద్ధాంతాల కోసం, జనసేన పార్టీని ఇంకా బలంగా ప్రజలకి తీసుకువెళ్లి, ఎలక్షన్ ఎప్పుడు వచ్చినా జనసేన టిడిపి కలిసి పోటీ చేస్తాయి. అలాగే ఎలక్షన్ ఎప్పుడు వచ్చినా అధికారంలోకి తీసుకురావడానికి మద్దికేర మండలం నందు జనసేన పార్టీ నాయకులు చాలా బలంగా ఉన్నారని మీకు తెలియజేస్తున్నామని అన్నారు. జనసేన పార్టీ అధ్యక్షులు ఈ నిర్ణయం తీసుకున్న మేము అధ్యక్షులు వారి నిర్ణయాన్ని కట్టుబడి పని చేస్తామని అన్నారు.