ఒంగోలు ( జనస్వరం ) : స్థానిక నాయకులు నరసింహారావు, పి.రాజేంద్ర ఆధ్వర్యంలో ప్రజా సమస్యలను తెలుసుకోవడంలో భాగంగా జనచైతన్య యాత్ర 60వ రోజు ఒంగోలులోని 9వ డివిజన్ లో పర్యటించారు. ప్రజలతో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా పలువురు ముఖ్యంగా జనసేన పార్టీ జనచైతన్య యాత్ర బృందం ముందు తీసుకొని వచ్చిన సమస్య ఒక్కటే మున్సిపల్ యంత్రాంగం ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటంలో పూర్తిగా వైఫల్యం చెందిందని అన్నారు. కాలువల్లో మురుగునీరు నిలిచిపోవడంతో, దోమల స్వైర విహారంతో రోగాల బారిన పడుతున్నామని, రంగు మారిన నీళ్లు తాగలేక నాన ఇబ్బందులు పడుతున్నామని అన్నారు. ఎంతమందికి చెప్పిన పట్టించుకోవటం లేదని జన చైతన్య యాత్ర బృందం ముందు వారి గోడును తెలియజేశారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ సంబంధిత అధికారులు దృష్టికి మన ప్రాంత సమస్యలను తీసుకొని పోయి పరిష్కారమయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం లో ప్రకాశం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి కళ్యాణ్ ముత్యాల, ఒంగోలు నగర జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి పల్ల ప్రమీల, ఒంగోలు నగర జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి ఆకుపాటి ఉష, వీర మహిళ మాదాసు సాయి నాయుడు, 28వ డివిజన్ అధ్యక్షులు కోట సుధీర్ మరియు జనసేన నాయకులు చెన్ను నరేష్, యాదల సుధీర్, జాన్,రాజా నాయుడు, ఆకాష్, నిఖిల్, యస్వంత్, జాను, ప్రేము, హరి తదితరులు పాల్గొన్నారు.