ఒంగోలు ( జనస్వరం ) : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో మరియు ప్రకాశం జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ గారి సూచన మేరకు స్థానిక నాయకులు నరసింహారావు,పి.రాజేంద్ర ఆధ్వర్యంలో ప్రజా సమస్యలను తెలుసుకోవడంలో భాగంగా జనచైతన్య యాత్ర 41వ రోజు ఒంగోలులోని 9వ డివిజన్ లో పర్యటించి ప్రజలతో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా పలువురు ముఖ్యంగా జనసేన పార్టీ జనచైతన్య యాత్ర బృందం ముందు తీసుకొని వచ్చిన సమస్య ఒక్కటే మున్సిపల్ యంత్రాంగం ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటంలో పూర్తిగా వైఫల్యం చెందిందని,కాలువల్లో మురుగునీరు నిలిచిపోవడంతో, దోమల స్వైర విహారంతో రోగాల బారిన పడుతున్నామని జన చైతన్య యాత్ర బృందం ముందు వారి గోడును తెలియజేశారు,ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ సంబంధిత అధికారులు దృష్టికి మన ప్రాంత సమస్యలను తీసుకొని పోయి పరిష్కారమయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం లో ప్రకాశం జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు చిట్టెం ప్రసాద్, ప్రకాశం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శులు చనపతి రాంబాబు, కళ్యాణ్ ముత్యాల, ఒంగోలు నగర జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి పల్ల ప్రమీల, ఒంగోలు నగర జనసేన పార్టీ కార్యదర్శి గోవింద్ కోమలి,ఒంగోలు నగర జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి ఆకుపాటి ఉష, మరియు వీర మహిళ మాదాసు సాయి నాయుడు, 28వ డివిజన్ అధ్యక్షులు కోట సుధీర్ మరియు జనసేన నాయకులు ఆనంద్ సాయి, తేజ్ కమల్, బుజ్జి, గాలి రత్న బాబు, బండారు వెంకటరమణయ్య, ఉంగరాల వాసు, అవినాష్ నాయుడు పర్చూరి, జోసెఫ్, గోపి, సత్తి, కోటయ్య, పాపయ్య, జాన్, ధోని తదితరులు పాల్గొన్నారు.