గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో నిరుద్యోగులకు అండగా చేపట్టిన కార్యక్రమాన్ని అడ్డుకోవడం అప్రజాస్వామ్యం అని నియోజకవర్గం జనసేన పార్టీ ఇంఛార్జ్ యుగంధర్ పొన్న గారు ఆగ్రహం వ్యక్తం చేసారు. పవన్ కళ్యాణ్ గారి పిలుపుతో వినతి పత్రం అందజేయడానికి బయలుదేరుతున్న ఆరు మండలాల అధ్యక్షులను, నియోజకవర్గం సమన్వయకర్తలను, గౌరవ అధ్యక్షులను, కార్యవర్గ సభ్యులను హౌస్ అరెస్టు చేసి, స్టేషన్ కి తరలించడం అన్యాయమని ఎద్దేవా చేసారు. అరెస్టులతో జనసేన ఉద్యమాన్ని ఆపలేరు. 30 లక్షల మంది నిరుద్యోగ యువత భవిష్యత్ కోసం శాంతి యుతంగా కార్యక్రమం చేపడితే నోటీసులు ఇచ్చి, నిబంధనలు పెట్టి అరెస్టులు చేసారు. ఈ నిబంధలను జనసేనకు మాత్రమే వర్తింప చేస్తారా? అధికార పార్టీ వేలమందితో చేసే కార్యక్రమాలకు, సన్మానాలకు ఊరేగింపులకు ఈ నిబంధనలు, నిర్బంధాలు ఎదుకు వర్తించడం లేదు? అని ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఒంటెద్దు పోకడలకు పోకుండా ఉత్తుత్తి జాబ్ కేలండర్ను ఆపి, నిరుద్యోగులకు నిజమైన జాబ్ క్యాలండర్ విడుదల చేసి వారి నిండు జీవితాలలో వెలుగును నింపాలని జనసేన పార్టీ డిమాండ్ చేస్తోందని తెలిపారు. ఇలాంటి ఆపుదల మునుముందు చేపడితే జనసేన పార్టీ మరింత విజృంభించి, బయపడక నిరుద్యోగుల సమస్యలపై అలుపెరుగని పోరాటం చేస్తోందని తెలియజేసారు. ఉద్యోగాలు ఇవ్వాలంటే ముందు ఉన్న ఉద్యోగస్తులకు సకాలంలో జీతాలు ఇవ్వాలి, జీతాలివ్వాలంటే ఖజానాలో డబ్బులు ఉండాలి. డబ్బులు ఉండాలంటే పరిశ్రమలు రావాలి. పరిశ్రమలు రావాలంటే పరిపాలన సాగాలి. పరిపాలన రావాలంటే పవన్ కళ్యాణ్ రావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు లోకనాధం నాయుడు, ఆరు మండలాల అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, సమన్వయ కర్తలు, నాయకులు మరియు జనసైనికులు తదితురులు పాల్గొన్నారు.