Logo
Date of Publish : 14 August 2020, 10:07 am
Editor : Sake Naresh

గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఆకతాయిలు, మరమ్మత్తులు చేసిన జనసైనికులు

గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఆకతాయిలు, మరమ్మత్తులు చేసిన జనసైనికులు

           స్వతంత్ర భరతావనిలో మన జాతీయ నాయకుల విగ్రహాలకు రక్షణ లేకుండా పోయింది. వీధికి ఒక రాజకీయ విగ్రహాన్ని నిర్మించిన మన రాజకీయ నాయకులు, ఊరిలో ఉన్న ఒక జాతీయ నాయకుడి విగ్రహాన్ని కాపాడలేని దుస్థితిలో ఉన్నాం. అధికారులు సైతం జాతీయ నాయకుల విగ్రహాలకు తగిన రక్షణ కల్పించడం లేదు. కొంతమంది ఆకతాయి వెధవలు జాతీయ నాయకుల విగ్రహాలను పగులకొట్టి వికృతానందాన్ని పొందుతున్నారు. ఇలాంటి సంఘటనలు ఎన్నో చూస్తూనే ఉన్నా వారి మీద చర్యలు మాత్రం ఉండడం లేదు. వివరాల్లోకి వెళ్తే తూర్పుగోదావరి జిల్లా సోమేశ్వరం గ్రామం కరోనా కేసులు ఎక్కువగా ఉండడం వల్ల రెడ్ జోన్ గా కొనసాగుతోంది. ఈ సమయంలో సోమేశ్వరంలోని బస్టాండ్ వద్ద ఉన్న మహాత్మా గాంధీ విగ్రహాన్ని కొంతమంది ఆకతాయులు చేయి విరగ్గొట్టరు. చేతిలో ఉన్న కర్రను కూడా ధ్వంసం చేశారు. ఈ విషయాన్ని తెలుసుకున్న సోమేశ్వరం జనసైనికులు ఆ విగ్రహాన్ని తిరిగి మరమ్మత్తులు చేశారు. అలాగే ఆ ప్రాంతాన్ని మొత్తం కూడా పరిశుభ్రం చేశారు. జనసైనికులు మాట్లాడుతూ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని తక్షణమే అధికారులు గుర్తించి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో శాకా కోటేశ్వరరావు, శాకా బాబీ, శాకా నాగేంద్ర, పిడక మణికంట, మల్లేశ్, బుద్దాల నరేంద్ర, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com