Logo
Date of Publish : 19 August 2020, 9:02 am
Editor : Sake Naresh

మరణించిన వ్యక్తికి పాడే మోసే వారు రాకపోవడంతో జనసైనికుడే అండగా నిలిచాడు

 మరణించిన వ్యక్తికి పాడే మోసే వారు రాకపోవడంతో జనసైనికుడే అండగా నిలిచాడు

      మరణించిన వ్యక్తికి అంత్యక్రియలు చేయడానికి అయినవాళ్లే ముందుకు రావడం లేదు. ఆ మృతదేహానికి పాడే మోసే నలుగురు కరువయ్యారు. తెలిసిన వాళ్ళు అంబులెన్సు తెచ్చారు కానీ, డ్రైవర్ గా ఎవరు ముందుకు రావడం లేదు. ఈ విషయం తెలుసుకున్న జనసేన యువ నాయకుడు ముందుకు వచ్చి తన మానవత్వాన్ని చాటుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం నియోజకవర్గంలో బాసుదేవ్ క్వార్టర్స్ లో నివాసం ఉంటూ బోర్డర్ లో ఓ ప్రవైట్ ట్రాన్స్పోర్ట్ లో గుమాస్తాగా పని చేస్తున్న కె. శివ ప్రసాద్ త్రిపాటి ఇంటి ప్రాంగణంలో పేపర్ చదువుతూ చనిపోయాడు. కరోనా ఉందేమో అని ఎవరూ ముందుకు రావడం లేదు. పరిచారకులు వైద్య సిబ్బందిని పిలిపించి కరోనా టెస్ట్ లు చేశారు. 108 కు ఫోన్ చేసినా ఫలితం లేదు. అయితేనేమీ ఇచ్చాపురం నియోజకవర్గ జనసేన సమన్వయకర్త యువ నాయకుడు దాసరి రాజు అంబులెన్సు డ్రైవర్ గా మారి మృతదేహాన్ని బాహుదా నది ఒడ్డున ఉన్న శ్మశాన వాటికకు తీసుకెళ్లి అంత్యక్రియలు పూర్తి చేశారు. ఈ విషయమై స్థానికులు అభినందించారు. దాసరి రాజు మాట్లాడుతూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు మాకు ఆదర్శమని, ఆయన అడుగుజాడల్లో నడవడం సంతోషకరం అని అన్నారు.   


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com