అనంతపురము ( జనస్వరం ) : అర్బన్ లోని భాగ్యనగర్, బిందెలకాలనీ వాసుల పిలుపు మేరకు జనసేన జిల్లా అధ్యక్షులు, అనంతపురము అర్బన్ ఇంచార్జ్ టి.సి.వరుణ్ ఆదేశాల మేరకు నగర, జిల్లా కమిటీ సభ్యులు, నాయకులు 2వ డివిజన్ లో పర్యటించారు. అనంతరం కాలనీవాసులు కాలనీలో ఏ వీధి మలుపు చూసినా ఇల్లు మధ్యలోకి మురికి నీరు దుర్వాసనతో కంపు కొడుతోందని. వెలగని వీధిలైట్లు, చెత్త కుప్పలు, జరాలతో సతమతమవుతున్నామని ఎన్నిసార్లు మొరపెట్టుకున్న స్పందించని ఎమ్మెల్యే, మున్సిపల్ కమిషనర్ అని జనసేన నగర అధ్యక్షులు పొదిలి బాబురావు గారితో కాలనీవాసులు చెప్పుకున్నారు. ఈ సందర్భంగా పొదిలి బాబురావు మాట్లాడుతూ... ఎక్కడ చూసినా ఇండ్ల మధ్యలో మురుగు నీరు, చెత్తా చెదారంతో పేరుకుపోవడంతో విషసర్పాలు, పందులు స్వైర విహారం చేస్తున్నాయని శీతాకాలంలో సీజనల్ వ్యాధులు స్వైర వ్యవహారం చేస్తున్నాయని, వైరల్ జ్వరాలతో చిన్నపిల్లలు, వృద్ధులు బాధపడుతున్నారని రోగాలు ప్రబులుతున్నాయని తెలిసిన ప్రభుత్వం స్పందించకపోవడం దుర్మార్గపు చర్య అన్నారు. నగర వాసుల సమస్యల పరిష్కారం పట్ల చిత్తశుద్ధి లేని వైసిపి ప్రభుత్వం కాలనీవాసుల సమస్యలు పరిష్కరించకపోతే జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు అంకె ఈశ్వరయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి కుమ్మర నాగేంద్ర, జిల్లా కార్యదర్శులు అవుకు విజయకుమార్, ముప్పూరి కృష్ణ, నగర ప్రధాన కార్యదర్శిలు మేదర వెంకటేష్, నగర కార్యదర్శులు కుమ్మర మురళి, కార్యక్రమాల కమిటీ సభ్యులు సంతోష్ కుమార్, నాయకులు రహీం భాష, విజయ భాస్కర్, విజయ్ దేవరయల్, నౌషాద్, తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com