నెల్లూరు (జనస్వరం ) : సిటీ నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్విరామంగా, నిరాటంకంగా జరుగుతున్న పవనన్న ప్రజాబాట కార్యక్రమం 231వ రోజున 11వ డివిజన్ సరస్వతి నగర్ రమణయ్య స్టోర్ ప్రాంతంలో జరిగింది. ఇక్కడ ప్రతి ఇంటికీ వెళ్ళిన కేతంరెడ్డి ప్రజల సమస్యలను అధ్యయనం చేసి అండగా నిలుబడతామని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి వద్ద స్థానికులు వారిని అనేక రోజులుగా ఇబ్బంది పెడుతున్న వీధి కుక్కల సమస్యను ఏకరువు పెట్టారు. ప్రతి నిత్యం వీధి కుక్కలతో ఇబ్బందిగా మారిందని పగలు రాత్రి తేడా లేకుండా కుక్కల అరుపులతో విసిగిపోతున్నామని అన్నారు. దారిలో ఒంటరిగా వెళ్లాలంటే భయంగా ఉందని, ఇటీవలి కాలంలోనే అనేకమంది కుక్క కాట్లకు గురయ్యారని తెలిపారు. ఈ వీధుల్లో బైక్ లో పోయే బాటసారులను కూడా కుక్కలు వెంబడిస్తున్నాయని దీని కారణంగా యాక్సిడెంట్లు కూడా జరుగుతున్నాయని వివరించారు. ఈ వీధి కుక్కల సమస్య గురించి స్థానిక నాయకులకు, అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవట్లేదని, ఈ సమస్యను తీర్చాల్సిందిగా కేతంరెడ్డిని కోరారు. వెంటనే స్పందించిన కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఈ అంశంలో సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడారు. తక్షణం ఈ సమస్యను తీర్చాల్సిందిగా కోరగా అధికారులు సానుకూలంగా స్పందించారు, కుక్కలను ఈ ప్రాంతం నుండి తరలిస్తామని తెలిపారు. ఈ అంశంపై అధికారుల చర్యలను పర్యవేక్షించి ఈ సమస్య తీరిందా లేదా అనే విషయాన్ని తెలుపాలని స్థానిక జనసేన పార్టీ నాయకులను, కార్యకర్తలకు సూచనలు జారీచేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com