వసతి గృహం నిర్మాణం స్మశానం పక్కన కాకుండా అనువైన స్థలంలో నిర్మించాలని నార్పల తహశీల్దార్ గారికి వినతిపత్రం అందించిన జనసైనికులు
అనంతపురం జిల్లా నార్పల మండలం, నార్పల గ్రామపంచాయితీ లో గల బాలికల ప్రభుత్వ పాఠశాలలో నిర్మిస్తున్న వసతి గృహం నిర్మాణం స్మశానం పక్కన కాకుండా అనువైన స్థలం లో నిర్మించాలని నార్పల తహశీల్దార్ గారికి వినతిపత్రం అందించడం జరిగింది. బాలికల పాఠశాల నందు నిర్మిస్తున్న వసతి గృహం శ్మశానవాటికకు దగ్గరగా ఉండటం వళ్ళ నష్టాలే ఎక్కువ గా విద్యార్థులు అనుభవించవలసి వస్తుందని, మానసికంగా విద్యార్థినిలు వేదనకు గురికావలసి వస్తుందని, ఊరి చివర ఉండటం విద్యార్థినిలకు రక్షణ కల్పించడం కూడా పెద్దసమస్య గా మారుతుందని వివరించడం జరిగింది. ఇదే విషయాన్ని గత ప్రభుత్వంలో ప్రజాప్రతినిధుల కు, అధికారులకు సామజిక కార్యకర్తలు, రాజకీయా పార్టీలు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు వివరంగా తెలియచేయడమే కాకుండా వసతి గృహ నిర్మాణం జరగకుండా అడ్డుకున్నారు. అప్పటి అధికారులు, ప్రజాప్రతినిధులు గ్రామప్రజలు, విద్యార్థుల మనోభావాలకు విలువ ఇచ్చి వసతి గృహనిర్మాణాన్ని నిలిపివేసి, వేరొక ప్రభుత్వ స్థలం లో నిర్మించాలని సంకల్పించారు. మరి యిప్పుడు అదే ప్రదేశంలో వసతి గృహాన్ని నిర్మించడంలో ఆంతర్యం ఏమిటి ? ప్రజా ప్రయోజనాలకన్నా నాయకులకు గాని, అధికారులకు గాని ఇంకా ఏదైనా ముఖ్యమా అని ప్రశ్నించడం జరిగింది? నిర్మాణం తిరిగి మొదలు పెట్టినప్పటినుండి చాలామంది చాలారకాలుగా అధికారులకు వసతిగృహం నిర్మాణము ఆపాలని విన్నవించినా కూడా అధికారులు ఈ విషయం పై పురోగతి లేదు. ప్రజాప్రతినిధులు ఎవరు స్థానికంగా నివాసం ఉండరు. ఉన్న వాళ్ళ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపరు. స్థానికంగా ఉన్న వారి పిల్లలే ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. గతంలో లాగా గ్రామ ప్రజల, విద్యార్థులు, వారి తల్లిదండ్రుల అభిప్రాయం సేకరణ చేసి వారు సుముఖంగా ఉంటేనే అక్కడ నిర్మాణం చేయాలనీ లేదంటే వేరొక అనువైన స్థలం లో నిర్మాణం సాగించాలని డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ నాయకులు తుపాకుల భాస్కర్, కలువాయి విశ్వనాధ్ రెడ్డి, గంజికుంట రామకృష్ణ, లోకేష్ కుమార్, కుస్వాంత్, ఎర్రిస్వామి మరియు మండల జనసైనికులు పాల్గొనడం జరిగింది.