Date of Publish : 14 September 2020, 3:27 pm
Editor : Sake Naresh
ముత్యాలమ్మపాలెం గ్రామ పంచాయితీలో ఉన్న సమస్యలను పరిష్కరించమని కలెక్టర్ గారిని కోరిన జనసైనికులు
ముత్యాలమ్మపాలెం గ్రామ పంచాయితీలో ఉన్న సమస్యలను పరిష్కరించమని కలెక్టర్ గారిని కోరిన జనసైనికులు
- ముత్యాలమ్మపాలెం గ్రామ పంచాయితీ, దిబ్బ పాలెం గ్రామం లో సుమారు 40 సంవత్సరాల క్రితం గ్రామ కంఠంలో ప్రభుత్వ తుఫాన్ రక్షిత భవనం నిర్మించడం జరిగింది. ఆ యొక్క భవనం నేడు పూర్తిగా శిధిలావస్థకు చేరుకుంది. ఇదే సమయంలో ఆ స్థలంలో కొందరు అక్రమంగా ప్రహరీ గోడలు మరియు ఇళ్లను నిర్మించడం జరిగింది. ఇదే విషయాన్ని గతంలో పరవాడ మండల MRO గారికి మరియు VRO గారికి లేఖ ద్వారా ఈ యొక్క సమస్యను వివరించడం జరిగింది. కానీ నేటికీ ఆ అక్రమ దారులలో ఏటువంటి చర్యలు తీసుకోలేదు. ఆ యొక్క భవనం పూర్తిగా గోడలు, స్లాబ్ విరిగి పడిపోవడం వలన చుట్టూ ప్రక్కల ఉండే చిన్న పిల్లలు, పెద్దలు అనేక సార్లు ప్రాణాపాయ స్థితి నుండి తప్పించుకున్నారు.
- ముత్యాలమ్మపాలెం గ్రామ పంచాయితీలో సుమారు 1800 మంది మత్స్యకార కుటుంబాలు సముద్రంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. అలాగే మత్స్యకార మహిళలు చేపలు వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. మరికొందరు మహిళలు కాయకూరలు అమ్ముకునే జీవనం సాగిస్తున్నారు. వర్షాకాలం, ఎండాకాలం సమయంలో ఎండలు, వర్షాలు పడటం వలన, ఎటువంటి మార్కెట్ లేకపోవడం వలన చేపలు, కాయకూరలు అమ్ముకోవడానికి తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.
పై యొక్క రెండు సమస్యలను పరిష్కరించమని కోరుతూ నేడు గ్రామ జనసైనికులు విశాఖపట్నం కలెక్టర్ ఆఫీస్ నందు స్పందనలో లేఖ ద్వారా వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ అనకాపల్లి పార్లమెంటరీ వర్కింగ్ కమిటీ సభ్యుడు ఆర్జిల్లి అప్పలరాజు గారు పాల్గొన్నారు.

All Rights Reserved By Janaswaram News.