పవన్ రావాలి పాలన మారాలి ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటున్న ప్రజానీకం
పెరిగిన ధరలతో జీవనం సాగించలేకపోతున్నాం
పడకేసిన పారిశుధ్యంతో రోగాల బారిన పడుతున్నాం
ఆదాయం పెరగలేదు ఖర్చు మాత్రం పెరిగింది
జనసేన నాయకులతో తమ సమస్యలను వెళ్లబుచ్చుకున్న స్థానిక జమ్మి చెట్టు బజార్ ప్రజానీక
ఒంగోలు ( జనస్వరం ) : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో మరియు ప్రకాశం జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ గారి సూచనల మేరకు డివిజన్ అధ్యక్షులు కోట సుధీర్ గారి ఆధ్వర్యంలో ప్రజా సమస్యలను తెలుసుకోవడంలో భాగంగా 57వ రోజు జనచైతన్య యాత్ర లో భాగంగా ఒంగోలులోని 28వ డివిజన్ లో జమ్మి చెట్టు బజార్లో పర్యటించారు ప్రజలతో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా స్థానిక ప్రజానీకం జనసేన నాయకులతో మాట్లాడుతూ ఈ జగన్ రెడ్డి ప్రభుత్వంలో పెరిగిన ధరలతో మేము జీవనం సాగించడం చాలా కష్టంగా మారిందని, ప్రజల ఆదాయం పెరగలేదు కానీ కుటుంబ పోషణ ఖర్చు మాత్రం పెరిగిందని అన్నారు. ఇప్పటిదాకా అందరికీ ఒక అవకాశం ఇచ్చామని మాకు ఎవరూ చేసింది ఏమీ లేదని, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు తాను అధికారంలోకి వస్తే ఏమి చేస్తారో చెప్పిన విధానం మమ్మల్ని బాగా ఆలోచింప చేసిందని అలాంటి నాయకుడికి ఈసారి అండగా నిలుస్తామని అన్నారు. అలానే పడకేసిన పారిశుధ్యంతో రోగాల బారిన పడుతున్నామని పట్టించుకునే నాధుడు లేడని వాపోయారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి సారధ్యంలో ఏర్పాటు కాబోయే ప్రభుత్వంలో మన ప్రాంత అభివృద్ధికి కచ్చితంగా పాటుపడతామని, కీలకమైన సమస్యలను అధికారంలోకి వచ్చిన వెంటనే తీర్చేలా ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం లో ప్రకాశం జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు చిట్టెం ప్రసాద్, ప్రకాశం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి కళ్యాణ్ ముత్యాల, ఒంగోలు నగర జనసేన పార్టీ కార్యదర్శి గోవింద్ కోమలి, ఒంగోలు నగర జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి ఆకుపాటి ఉష, వీర మహిళ మాదాసు సాయి నాయుడు మరియు జనసేన నాయకులు చెన్ను నరేష్, నరసింహారావు, పఠాన్ కాలేషా, యాదల సుధీర్, ఉంగరాల వాసు, అవినాష్ పర్చూరి, సాయి కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com