
రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేసే దాని పైన ఉన్న శ్రద్ధ అభివృద్ధి పైన కొరవడిందని కర్నూలు జిల్లా బనగానపల్లే నియోజకవర్గ జనసేన నాయకులు పత్తి సురేష్ అన్నారు. స్థానిక జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో సురేష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వైయస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలతో అభివృద్ధిని విస్మరించారని ఇసుక కొరతతో రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుక కొత్త పాలసీ తో పేద మధ్య తరగతి ప్రజలు ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావని టిప్పర్ 50 , ట్రాక్టర్ 10 వేలు ఇసుక ఉండటంతో పేద మధ్యతరగతి ప్రజలు ఇల్లు నిర్మించుకోవాలంటే హడలిపోతున్నారని ఆవేదన చెందారు. భవన నిర్మాణ కార్మికులతోపాటు నిర్మాణ రంగంపై ఆధారపడిన ముప్పై వ్యవస్థలు తీవ్ర కష్టాలు ఎదుర్కొంటున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇసుక కొరతపై స్పందించి వెంటనే పరిష్కరించకపోతే జనసేన ఆధ్వర్యంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు గుర్రప్ప, బోదనం ఓబులేసు, నాగప్రసాద్, కిట్టు, భాను, అశోక్, డేవిడ్ తదితరులు పాల్గొన్నారు.