Logo
Date of Publish : 15 December 2023, 10:46 pm
Editor : Sake Naresh

అంగన్వాడి వర్కర్ల న్యాయ పరమైన డిమాండ్లను వెంటనే అమలు చేయాలి

      కదిరి ( జనస్వరం ) : కదిరి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఎదురుగా సిఐటియు యూనియన్ ఆధ్వర్యంలో వారి ప్రాదాన డిమాండ్ల అమలుకోసం నిరవరధిక సమ్మె కార్యక్రమాన్ని చేపట్టారు. వీరికి కదిరి జనసేన పార్టీ తరపున ఇంచార్జ్ భైరవ ప్రసాద్ పాల్గొని దీక్షకు సంఘీభావం తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుందని మహిళలని చూడకుండా వారి న్యాయ బద్దమైన డిమాండ్లను అమలు చేయకుండా అంగన్వాడీ వర్కర్లను రోడ్డుమీదకి లాగారు. అదేవిధంగా కారోనా వంటి విపత్కర పరిస్థితులలో తమ ప్రాణాలను పణంగా పెట్టి అంగన్వాడీ వర్కర్లు ప్రజారోగ్యం కోసం కృషి చేశారని ప్రభుత్వం వారి న్యాయ బద్దమైన డిమాండ్లైన కనీస పనికి కనీస వేతనం ఇవ్వాలని అంగన్వాడీ వర్కర్ల కోసం ప్రత్యేక సంక్షేమ పథకాలు అమలు చేయాలని రిటైర్మెంట్ బెనిఫిట్స్ 5లక్షలు ఇవ్వాలని అదేవిధంగా రిటైర్మెంట్ తర్వాత వేతనంలో సగం పెన్షన్ ఇవ్వాలని కోరారు. 10 లక్షల గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని మొదలగు ముఖ్యమైన 10రకాల డిమాండ్లను వైకాపా ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని జనసేన పార్టీ తరపున ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. అలాగే తన పాదయాత్రలో పక్క రాష్ట్రం లో కన్నా వెయ్యి రూపాయలు ఎక్కువ వేతనం ఇస్తానని చెప్పి ఈ రోజు మాట తప్పి మడమ తిప్పడని చెప్పారు. వారి న్యాయమైన డిమాండ్స్ ను మానవతతో తీర్చలని లేదంటే త్వరలోనే జనసెన టీడీపీ అధ్వర్యంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని అప్పుడు వారి న్యాయమైన డిమాండ్స్ తీరుస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టౌన్ అధ్యక్షుడు చలపతి, నల్లచెరువు, గాండ్లపెంటా మండల కన్వీనర్లు రవికుమార్, రవీంద్ర నాయక్, టౌన్ ఉపాధ్యక్షుడు లక్ష్మణ్, అంజిబాబు, చెక్క రమణ, హరిబాబు, పలవర శ్రీనివాసులు, రాజేంద్ర ప్రసాద్, గోపీనాథ్, వంశీ, గంగరాజు, ప్రసాద్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com