– పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్ళిన జనసైనికులు.
– రోజుకు లక్షల్లో సంపాదిస్తున్నారని ఫిర్యాదు
దాచేపల్లి, (జనస్వరం) : బార్ అండ్ రెస్టారెంట్ల ముసుగులో గురజాల నియోజకవర్గంలో అధికార పార్టీ నాయకులు అక్రమంగా బెల్టుషాపులు నడుపుతున్నారని జనసేన గురజాల నియోజకవర్గ కార్యకర్తలు ద్రోణాదుల అంకారావు, కండెల అంజి లు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు. విజయవాడలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో వారు పవన్ కళ్యాణ్ కు వివరాలందించారు. నియోజకవర్గంలోని పిడుగురాళ్ల, మాచవరం, దాచేపల్లి, గురజాల మండలాల్లో యధేచ్ఛగా నడుపుతున్నారని వివరించారు. ప్రభుత్వ దుకాణాలకు వచ్చే మద్యం ను సుమారు 70 శాతం దారి మళ్లించి వారి గోడౌన్ కు తరలించి అక్కడ నుండి గ్రామల్లోని బెల్ట్ షాపులకు తరలించి రూ.50 లు ఎక్కువ ధరకు అమ్ముతారనీ పవన్ కు తెలిపారు. వారి సరుకుగా గుర్తు కోసం తమ షాపులకు సంబంధించిన స్టిక్కర్లు వేస్తారని తెలిపారు. ఈ సందర్భంగా బెల్ట్ షాపు నిర్వహకుల వద్ద రూ.30 వేలు డిపాజిట్ వసూలు చేస్తారని పవన్ కళ్యాణ్ కు వివరించారు. ఈ విధంగా నాలుగు మండలాల్లో రోజుకు లక్షల్లో సంపాదిస్తున్నారని తెలిపారు. ఇప్పటికే ప్రభుత్వం అధిక రేట్లకు అమ్ముతుండగా, ప్రభుత్వ షాపుల్లో కంటే క్వార్టర్ కు రూ.50లు దారుణంగా వసూలు చేస్తున్నారని పవన్ కళ్యాణ్ కు తెలిపారు. ఇంత జరుగుతున్న ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ అధికారులు కనీసం అటు వైపు చూసిన దాఖలాలు లేవని వారు తెలిపారు. ఈ అంశంపై కూలంకషంగా చర్చించి కార్యాచరణ చేద్దామని పవన్ కళ్యాణ్ చెప్పినట్లు జనసేన నాయకులు తెలిపారు.