ఉరవకొండ ( జనస్వరం ) : జనసేన పార్టీ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్ మాట్లాడుతూ ఉరవకొండ పట్టణంలోని చాబాల రోడ్ లో జైనబ్బీ దర్గా వెనకాల ఉన్నటువంటి చెరువు కి కంచె ఏర్పాటు చేయవలసిందిగా కోరారు. రెండు సంవత్సరాల క్రితం అప్పటి పంచాయతీ కార్యదర్శి గారికి మరియు వైసీపీ ఎమ్మెల్సీ వై. శివరామిరెడ్డి గారికి వినతి పత్రం అందజేశామని అన్నారు. రెండేళ్లు కావస్తున్నా నేటికీ కంచె ఏర్పాటు దిశగా ఎటువంటి చర్యలు ప్రారంభించలేదని కనీసం ఇప్పుడైనా అధికారులు స్పందించి కంచే ఏర్పాటు చేయవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు దేవేంద్ర, మణి, రమేష్, బోగేష్, వంశీ, లక్ష్మీరెడ్డి తదితరులు పాల్గొన్నారు.