పాలకొండ, మార్చి31 (జనస్వరం) : పార్వతీపురం మన్యం జిల్లా, పాలకొండ నియోజక వర్గం వీరఘట్టం మండలంలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యులు మీడియాతో మాట్లాడుతూ నినదించారు. జనసేన పాలకొండ టిక్కెట్ వర్గపోరుకి వద్దు – జనసేన పార్టీ నేతకు ముద్దు. వర్గపోరుకి వద్దు – నిమ్మల నిబ్రంకి ముద్దు. ఇతర పార్టీ నేతలు వద్దు – జనసేన నేత కి ముద్దు తెలుగుదేశం పార్టీ నేతలు జయకృష్ణ భూదేవిలకు వద్దు – జనసేన నేత నిమ్మల నిబ్రం ముద్దు అని నినాదాలు చేశారు. అనంతరం ఉత్తరాంధ్ర జనసేన నాయకులు, ఆంధ్రప్రదేశ్ తూర్పుకాపు సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు బి.పి నాయుడు మాట్లాడుతూ నిన్నటిదాకా తెలుగుదేశం పార్టీ నాయకులు పాలకొండ జనసేనకి ఇవ్వవొద్దు అన్నారు. మరి జనసేన పార్టీలో టిక్కెట్ కోసం తిరుగుతున్నారు. జనసేన పార్టీని తెలుగుదేశం నాయకులు చులకనగా చూస్తున్నారు. మా జనసేన పార్టీ కార్యకర్తలు పొత్తు ధర్మాన్ని పాటిస్తూ అభ్యర్థి ఎవరైనా గెలిపించాలని కృషి చేస్తున్నాము. తెలుగుదేశం పార్టీ నాయకులు పొత్తుదర్మం పాటించి జనసేన పార్టీ సమన్వయకర్త నిమ్మల నిబ్రం కి మద్దతుగా నిలవాలని జనసేన పార్టీ విజయం సాదించేందుకు కృషి చేయాలని కోరారు. వలస వచ్చే నాయకులకు వద్దు – జనసేన సమన్వయ కర్త నిమ్మల నిబ్రం ముద్దు అని అన్నారు. జనసేన జాని మాట్లాడుతూ పొత్తులో భాగం పాలకొండ టిక్కెట్ జనసేనకి కేటాయించారు. నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నేతలు జనసేన పార్టీ టిక్కెట్ కోసం ఆశ పడడం హాస్యాస్పదంగా ఉంది. జనసేన పార్టీ టిక్కెట్ జనసేన పార్టీ కోసం పనిచేసేవారికి మాత్రమే ఇవ్వాలని జనసేన జాని డిమాండ్ చేశారు. మత్స. పుండరీకం మాట్లాడుతూ జనసేన పార్టీ నాయకులు కే జనసేన టిక్కెట్ కేటాయించాలని, తెలుగుదేశం పార్టీ నేతలు జయకృష్ణ, భూదేవి లు జనసేన పార్టీ టిక్కెట్ ఆశిచడం ఎంతవరకు సమంజసం అని అడుగుతున్న, పొత్తు ధర్మం పాటించకుండా – పొత్తుకి తూట్లు పొడుస్తున్నారు. మరి జనసేన పార్టీ టిక్కెట్ ఆశిస్తున్నా జయకృష్ణ, భూదేవి లు తెలుగుదేశం పార్టీకి నమ్మక ద్రోహం చేసినట్టే కదా? అని అడుగున్న పాలకొండ టిక్కెట్ జనసేన నేత, గిరిజన నేత, మాజీ జడ్పీటీసీ సభ్యుడు, నియోజకవర్గ సమన్వయకర్త నిమ్మల నిబ్రంకి ఇవ్వాలని కోరుతున్నాము. ఈ కార్యక్రమంలో సాయి పవన్, ప్రేమ్ కుమార్, జామి అనిల్ తదితరులు పాల్గొన్నారు.