Logo
Date of Publish : 18 September 2021, 12:36 pm
Editor : Sake Naresh

అనారోగ్యంతో బాధపడుతున్న జనసైనికుడికి ఆర్థిక సహాయం అందించిన జనసేన NRI సేవా సమితి కువైట్ విభాగం

          మదనపల్లి ( జనస్వరం ) : మదనపల్లి పట్టణానికి చెందిన నాయ్ని లోకేష్ బాబు ఇటీవల బైపాస్ సర్జరీ చేయించుకొని ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న జనసేన పార్టీ చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత చిరు ప్రయత్నంగా ఆదుకోవాలని, అతని మందుల ఖర్చులకు సహాయపడాలని జనసేన NRI సేవా సమితి కువైట్ వారి దృష్టికి తీసుకెళ్లారు. వారు స్పందించి తక్షణ సహాయంగా 15,000/- నగదు మొత్తాన్ని లోకేష్ కుటుంబానికి అందజేయడం జరిగింది. దారం అనిత గారు మాట్లాడుతూ విదేశాలలో ఉంటూ సహాయం అని తెలియగానే స్పందించే జనసేన NRI సేవా సమితి కువైట్ వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. పవన్ కళ్యాణ్ జన్మదిన సందర్భంగా 30 రోజుల్లో 30 ప్రాంతాల్లో 30 సేవా కార్యక్రమాలను గుర్తూ చేస్తూ, వారి సేవలు అభినందనీయమని కొనియాడారు. ఈ సందర్భంగా దాతలు రామ్ రంగా, శ్రీకాంత్ బీనేని, మలిశెట్టి మల్లికార్జున, సాయిలకు  ధన్యవాదములు తెలియజేశారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com