పాడేరు ( జనస్వరం ) : జి.మాడుగుల మండల కేంద్రంలో మంగళవారం పాత్రికేయులతో సమావేశమైన జనసేనపార్టీ నాయకులు. ఈ సందర్బంగా ఇన్చార్జ్ డా..గంగులయ్యగారు మాట్లాడుతూ మండల నాయకులకు ఎన్నికలకు సమాయత్తం చేశారు.ప్రజల్లో ప్రభుత్వం పై ఉన్న వ్యతిరేకత సర్వత్రా ఆదివాసీ ప్రాంతమంతా నెలకొంది అనేక విషయాల్లో వైఫల్యాలు చెందిన ప్రభుత్వం యొక్క తీరు గిరిజనుప్రజలకు బాగా తెలిసిందే. ఇదే విషయంపై మనం గిరిజన ప్రాంతాల్లో ఇప్పటివరకు మనం తేలియజేసాం. బలమైన ప్రతిపక్ష పాత్ర పోషించాం. మన యువత దగా పడిందని మన గిరిజన ప్రజలకు అనేక మాధ్యమాల రూపంలో తెలియజేస్తూ చైతన్య పరుస్తూనే ఉన్నాం. కొద్దీ రోజుల తర్వాత ఇరు పార్టీల అధినేతలతో అధికారికంగా అసెంబ్లీ స్థానాలు కేటాయింపులు విడుదల చేయనున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులతో సమన్వయంతో ఈ ఎన్నికలకు జనసేనపార్టీ శక్తి ఏమిటో నిరూపించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ప్రతి జనసైనికుడు సిద్ధాంతబలంతో అనుకున్నా లక్ష్యాన్ని సాధించడానికి సిద్ధంగా ఉండాలని దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో జి.మాడుగుల మండల అధ్యక్షులు మసాడి భీమన్న, జిల్లా సంయుక్త కార్యదర్శి కిల్లో రాజన్, మండల కార్యదర్శి గొంది మురళి, పవన్, గౌరవ అధ్యక్షులు తెరవాడ వెంకటరమణ, గంగప్రసాద్, తల్లే త్రిమూర్తులు, గుండెరి పార్వతి, బాలకృష్ణ, తదితర జనసైనికులు పాల్గొన్నారు.