మదనపల్లిలో జనస్వరం న్యూస్ క్యాలెండర్ల ఆవిష్కరణ కార్యక్రమంమదనపల్లి, జనవరి 2, (జనస్వరం) : నూతన సంవత్సరం 2026 సందర్భంగా జనస్వరం న్యూస్ వారు రూపొందించిన నూతన క్యాలెండర్లను మదనపల్లి ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ భాషా గారు ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం జనసేన పార్టీ రాయలసీమ రీజినల్ కోఆర్డినేటర్ దారం అనిత ఆధ్వర్యంలో నిర్వహించబడింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ మాట్లాడుతూ, గత సంవత్సరం ఎదురైన బాధలను వెనక్కి నెట్టి, కొత్త ఆశలు, కొత్త సంకల్పాలతో నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. జనస్వరం న్యూస్ రూపొందించిన క్యాలెండర్లలో కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, జనసేన పార్టీ సిద్ధాంతాలు, ఆశయాలను చక్కగా ప్రతిబింబించారని ప్రశంసించారు. రానున్న రోజుల్లో జనస్వరం వెబ్ మీడియా, వార్తాపత్రిక మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో దారం అనిత మాట్లాడుతూ, అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఒక సందర్భంలో “జనసైనికులే నా మీడియా, నా వార్తాపత్రికలు” అన్న మాటలతో ప్రేరణ పొంది జనస్వరం న్యూస్ స్థాపించడమన్నది ఆనందకరమని తెలిపారు. ఈ రోజు రాష్ట్రంలో జనసేన పార్టీకి సంబంధించిన క్షేత్ర స్థాయి వార్తలను ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా తీసుకెళ్తున్న జనస్వరం టీమ్‌ను ఆమె అభినందించారు. గత ఐదు సంవత్సరాలుగా క్యాలెండర్లు, మ్యాగజైన్లు రూపొందిస్తూ విశేష పాఠక ఆదరణ పొందుతున్న జనస్వరం న్యూస్ మరింత ఎదగాలని ఆమె ఆకాంక్షించారు. క్రియాశీలక నాయకులు శశి రాయల్ మాట్లాడుతూ, క్షేత్ర స్థాయిలో జరిగే వార్తలను నిత్యం ప్రజల ముందుకు తీసుకువెళ్తూ విశ్వాసాన్ని సంపాదించుకోవడం అభినందనీయమని అన్నారు. పార్టీ విధానాలు, కూటమి ప్రభుత్వం చేసిన కార్యక్రమాలను క్యాలెండర్ల రూపంలో ప్రజలకు చేరవేయడం మంచి ప్రయత్నమని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో మధు, వాణి, ఆది, ప్రసాద్, కుప్పాల శంకర్ తదితరులు పాల్గొన్నారు.