విశాఖపట్నం, (జనస్వరం) : హెటిరో వేసిన పైప్ లైన్ కి వ్యతరేకంగా మత్స్యకారులు చేస్తున్న నిరసనలకు జనసేన పార్టీ నాయకులు జనసేన పార్టీ రాష్ట్ర మత్స్య వికాస్ విభాగం ఛైర్మన్ బొమ్మిడి నాయకర్, జనసేన రాష్ట్ర మత్స్య వికాస్ విభాగం ప్రధాన కార్యదర్శి ఆకుల ప్రవీణ్ కుమార్, జనసేన రాష్ట్ర మత్స్య వికాస్ విభాగం కార్యదర్శులు k.సత్య నారాయణ, T. శేఖర్, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి బోడపాటి శివదత్ మద్దతు పలికారు. బొమ్మిడి నాయకర్ మాట్లాడుతూ సముద్రమును నమ్ముకున్న మత్స్యకారులు బ్రతుకులు ప్రభుత్వాలకు చులకనై పోయిందని మత్స్యకారులు సమస్యలు తీర్చే నాయకులు కరువయ్యారని విమర్శించారు. అనుమతులు లేకుండా వేసిన పైప్ లైన్లు వెంటనే తొలగించి మత్స్యకారులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే 38 రోజుల నుండి మత్స్యకారులు చేస్తున్న ప్రభుత్వ తరుపున సమస్య పరిష్కారం చేసే ఎమ్మెల్యేకూడా పరామర్శించి వెళ్ళి పోవడం సిగ్గు చేటని దుయ్య బట్టారు. మీ సమస్యను 3 లేదా 4 రోజులలో పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తామని ఈ విషయంపై చర్చించిన తరువాత పవన్ కళ్యాణ్ కూడా స్పందిస్తారని తెలియజేశారు. మత్స్యకార నాయకులు జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ఈ సమస్య మీద కలుస్తామంటె అప్పాయింట్మెంట్ తీసుకొని మీ సమక్షంలో ఈ విషయం మీద చర్చించే కార్యక్రమం ఏర్పాటు చేస్తామని తెలియజేశారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కూడా ఈ సమస్య మీద స్పందించే కార్యక్రమం ఏర్పాటు చేస్తామని తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారుల సమస్యలమీద వెంటనే స్పందించి పరిష్కారం చూపించాలని తెలియజేశారు. జీవనోపాధి లేకుండా ఎన్ని రోజులు మత్స్యకారులు నిరసనలు చేయాలనీ వారి కుటుంబ సభ్యుల పోషణకు బాధ్యత ఎవరిదని విమర్శించారు. వెంటనే ప్రభుత్వం కల్పించుకొని మత్స్యకారులు 38 రోజుల నుండి చేస్తున్న నిరసనలకు పరిష్కారం చూపి వాళ్ళు యదావిధిగా వేటకు పోయి కుటుంబాలను పోషించుకునే అవకాశం కల్పించాలనే చిత్తశుద్ది ప్రభుత్వానికి ఉంటే పైప్ లైన్లు వెంటనే తొలగించి పరిష్కారం చూపించాలని డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో ఆంధ్ర మత్స్యకార జె.ఎ.సి. రాష్ట్ర అధ్యక్షులు కంబాల అమ్మోరియ్య, ఆంధ్ర మత్స్యకార జె.ఎ.సి ఉపాధ్యక్షులు మేరిగి కొర్లయ్య, సీపీఎం కార్య వర్గ సభ్యులు ఎమ్.అప్పలరాజు, ఆంధ్ర మత్స్యకార జె.ఎ.సి రాష్ట్ర విద్యార్ధి ప్రధాన కార్యదర్శి వాసిపిల్లి నూకరజు పలువురు జనసేన నాయకులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com