పాలకొండ, (జనస్వరం) : పార్వతీపురం మన్యం జిల్లా, పాలకొండ నియోజకవర్గo, వీరఘట్టం మండలం, నడుకూరు గ్రామంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో డబ్భై ఐదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు సభ్యుడు మత్స పుండరీకం మాట్లాడుతూ నా దేశం అమర భారతం మనిషిలోని మూర్ఖత్వన్ని రూపుమాపి, దైవత్వన్ని నింపి మనిషిని పునరుజ్జీవింపజేసే అద్భుత శక్తి భారతదేశానికి సొంతం. వివేకానందుని దేశభక్తి, భగత్ సింగ్ ఆత్మశక్తి, గాంధీజీ ఆశయస్ఫూర్తి.. మరెందరో స్వాతంత్ర్య కోసం పోరాడిన స్వరాజ్య సమరయోధులు కలలు నిజం చేసి సురాజ్య స్థాపనే ధ్యేయంగా జనసేన పార్టీ పనిచేస్తుంది అని, స్వరాజ్య సాధన ఆనాటి సమరయోధుల ఘనత - సురాజ్య స్థాపన ఈనాటి స్వతంత్ర భారత పౌరుల బాధ్యత అని, అదేవిధంగా డబ్భై ఐదవ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా భారతదేశం సాంఘిటిత ఆత్మకి నిదర్శనం హార్ ఘర్ తీరంగా - ఆజాధీ కా అమృత్ మహోత్సవ్ అని మత్స పుండరీకం అన్నారు. అలాగే చింత గోవర్ధన్ మాట్లాడుతూ ఆనాటి త్యాగమూర్తులు కలలుగన్న భవ్యభారత్ నిర్మాణానికి యువత పిడికిలి బిగించాలని, దేశ రక్షణ, భద్రత, పురోగతి, శ్రేయస్సు శక్తి వంచన లేకుండా యువశక్తి కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కలిపిల్లి సింహచలం, కంటు రాంబాబు, వాన పవన్, కర్నేన సాయి పవన్, బి.పి.నాయుడు తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com