కొల్లాపూర్, (జనస్వరం) : వీపనగండ్ల మండల కేంద్రంలో జనసేనపార్టీ కొల్లాపూర్ నియోజక వర్గం కో-ఆర్డినేటర్ భైరవ సాంబశివుడు ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తలు ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో బైరపోగు సాంబశివుడు మాట్లాడుతూ గ్రామస్థాయికి మండల వ్యాప్తంగా తీసుకుపోయే కార్యాచరణ గురించి పార్టీ బలోపేతం గురించి కార్యకర్తలతోటి సమావేశంలో చర్చించారు గెలిచే విధంగా జనసేన పార్టీ సిద్ధాంతాలను పవన్ కళ్యాణ్ ఆలోచన విధానాన్ని ప్రజలకు చేరువయ్యే విధంగా కృషి చేయాలని నాయకులకు జనసేన పార్టీ కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు. జనసేన పార్టీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఉన్న బడుగు బలహీన వర్గాలకు చెందిన పార్టీ కాబట్టి ఈ పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలకు చేరువే విధంగా పవన్ కళ్యాణ్ ఆలోచన విధానం ప్రజలకు తెలిసే విధంగా గడపగడపకి పార్టీని విస్తరించాలని విస్తరించే విధంగా కార్యచరణ ఉండాలని ఆయన గుర్తు చేశారు. అలాగే వీపనగండ్ల మండల వ్యాప్తంగా ప్రజా సమస్యల పైన దృష్టి సారించి అవి పరిష్కరించే దిశగా మన భవిష్యత్తు కార్యాచరణ ఉండాలని దానికి తగిన సూచనలు ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అభిమానులని జనసేన పార్టీ కార్యకర్తలుగా నాయకులుగా జనసేన పార్టీని ప్రజలకు చేరువ చేసే బాధ్యత పార్టీని కాపాడుకునే బాధ్యత మన అందరి పైన ఉందని గుర్తు చేశారు. అదే విధంగా జనసేనపార్టీ కొల్లాపూర్ నియోజకవర్గంలో బలమైన ప్రత్యామ్నాయ శక్తిగా పార్టీ ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మండలానికి చెందిన నాయకులు మీసాల విశాల్ కిరణ్, బాలకృష్ణ, శ్రీకాంత్, శివకృష్ణ, ఎజ్జు, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com