Logo
Date of Publish : 06 May 2022, 8:45 am
Editor : Sake Naresh

తేజస్విని కుటుంబానికి జనసేన పార్టీ అండగా ఉంటుంది

●అత్యాచారం చేసి చంపిన నిందితులకు కఠినమైన శిక్ష పడే విధంగా జనసేనపార్టీ తరుపున పోరాడతాం

●రాయలసీమ జనసేనపార్టీ మహిళా విభాగం ప్రాంతీయ కమిటీ సభ్యురాలు పెండ్యాల శ్రీలత

    గోరంట్ల, (జనస్వరం) : ఉమ్మడి అనంతపురం జిల్లా గోరంట్ల మండలానికి చెందిన విద్యార్థి తేజస్విని ని మానవ మృగాలు అత్యంత దారుణంగా అత్యాచారం చేసి చంపేశారు. ఈ విషయం తెలుసుకున్న రాయలసీమ మహిళా విభాగం ప్రాంతీయ కమిటీ సభ్యురాలు పెండ్యాల శ్రీలత బాధిత కుటుంబాన్ని పరామర్శించి, కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ మీ కుటుంబానికి జనసేన పార్టీ అండగా ఉంటుందని తెలియజేశారు. ఆ తర్వాత నిందితులకు కఠినమైన శిక్ష పడే విధంగా బాధితురాలి కుటుంబానికి న్యాయం జరగాలని జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పెండ్యాల శ్రీలత పాల్గొని గన్ కంటే ముందుగా జగన్ వస్తాడన్న అధికార పార్టీ వాళ్ళు రాష్ట్రంలో మహిళలపై ఇన్ని అఘాయిత్యాలు జరుగుతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ఉండిపోతుందని, ప్రస్తుతం రాష్ట్రంలో మహిళలు స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి లేదని మహిళలు తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని జీవిస్తున్నారని దిశ చట్టాన్ని కఠినంగా అమలు చేసి ఈ రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, దాడులను ప్రభుత్వం ఇప్పటికైనా అరికట్టాలని జనసేన పార్టీ తరఫున కోరుతున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి సురేష్, చిలమత్తూరు మండల అధ్యక్షులు వెంకటేష్, అనంతపురం నగర కార్యదర్శి జక్కి రెడ్డి పద్మావతి, వీర మహిళలు కాశెట్టి సావిత్రి, శ్రీదేవి, జనసేన నాయకులు, మండలాల అధ్యక్షులు, కార్యకర్తలు, వీర మహిళలు తదితరులు పాల్గొని బాధితురాలికి అండగా నిరసన తెలపడం జరిగింది.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com