పెందుర్తి ( జనస్వరం ) : నియోజకవర్గం విశాఖపట్నం జిల్లాలో 2018 సంవత్సరంలో గవర్నమెంట్ ఐటిఐ, 2019 సంవత్సరంలో ప్రభుత్వ బాలురు గురుకుల పాఠశాలను నరవ గ్రామంలో ప్రభుత్వం మంజూరు చేసిన ఇప్పటివరకు ఎటువంటి కట్టడాలు జరపకుండా అద్దె బిల్డింగుల్లోను, మరియు ఇతర ప్రదేశాల్లో ఈ యొక్క విద్యాసంస్థలును నడపడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ జనసేన పార్టీ నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. స్థానిక నాయకులు జనార్ధన శ్రీకాంత్ వబ్బిన మాట్లాడుతూ ఈ యొక్క గ్రామంలో రెండు ప్రభుత్వ విద్యాసంస్థలు మంజూరు చేసినప్పటికి స్థానిక ప్రజాప్రతినిధులు చిత్తశుద్ధి లోపించి, అలసత్వం వహించడం వలన ఈ రెండు విద్యాసంస్థలుకు సరైన ప్రభుత్వ బిల్డింగులు లేకపోవడం వలన, బిల్డింగ్ నిర్మాణానికి సరైన ప్రభుత్వ స్థలాన్ని చూపించకపోవడం వలన ఈరోజు రెండు విద్యాసంస్థలు వేరే ప్రదేశానికి మార్చడానికి ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటాయని ఇది ఈ గ్రామ అభివృద్ధికి చాలా బాధాకరమైన విషయం అని అన్నారు. వివరాల్లోకి వెళ్తే 2019 ఫిబ్రవరి నెలలో బాలురు గురుకుల పాఠశాల 480 మంది విద్యార్థులతో 5 తరగతి నుంచి 10 తరగతి వరకు కానీ ఇప్పుడు ఇది అద్ది బిల్డింగ్ లో నెలకు సుమారు 2 లక్షల 50 వేలు అద్ది చెల్లించి విద్యార్థులకు అరకొర సదుపాయాలతో ఒక ప్రైవేట్ బిల్డింగ్ లో ఉండడం వలన ప్రభుత్వం 360 మంది విద్యార్థులుకు మాత్రమే అనుమతి ఇవ్వడం జరిగిందని అన్నారు. దీనికి పూర్వం 10 ఎకరాల ప్రదేశంలో బీసీ వెల్ఫేర్ ఫండ్స్ ద్వారా సుమారు 40 లక్షలు గ్రాండ్ అయ్యాయని, ఈ యొక్క విద్యాసంస్థకు సరైన స్థలాన్ని కేటాయించండి అని చెప్పి ఆర్డిఓ గారు ఎమ్మార్వో గారికి ఫైల్ పంపించడం, అప్పటి MRO గారు, స్థానిక ప్రజాప్రతినిధి MLA గారు అలసత్వం వలన ఇప్పటివరకు బిల్డింగ్ నిర్మాణానికి ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. రెండవది 2018 సంవత్సరంలో 5 ట్రేడ్లతో సుమారు 224 మంది విద్యార్థులతో సెంట్రల్ గవర్నమెంట్ DGTC నిధులతో లెఫ్ట్ వింగ్ విధానంతో నక్సలిజం పిల్లలకు స్కిల్ ఇండియా ద్వారా నైపుణ్యం కోసం గవర్నమెంట్ ఐటిఐ మంజూరు చేయడం జరిగిందన్నారు. ఈ గ్రామంలో సుమారు 5 ఎకరాల ప్రదేశంలో నిర్మాణ పనులు చేపట్టడానికి ప్రయత్నించినప్పటికీ కొన్ని కారణాలవలన ఆ యొక్క నిర్మాణ పనులు ఆగిపోవడం వలన ఇప్పుడు ఈ ఐటిఐ కంచరపాలెం లో ప్రభుత్వ ఐటిఐ బిల్డింగ్ లో విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు లోపం వలన ఈ యొక్క ఐటిఐ హుకుంపేట్ మండలానికి బదిలీ చేయడం, మరలా పాడేరు జిల్లాకి కూడా బదిలీ చేయడానికి అధికారులు అనుకూలంగా ఉన్నారని, ఈరోజు ఈ రెండు విద్యాసంస్థలు కూడా నరవ గ్రామం నుండి వేరే గ్రామానికి బదిలీ చేయడాన్ని జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నానము, దీనికి ముఖ్య కారణం స్థానిక ప్రజా ప్రతినిధిలు కారణమని జనసేన పార్టీ భావిస్తుందని, ఇప్పటికైనా ఎమ్మెల్యే అదీప రాజు గారు, అనకాపల్లి MP సత్యవతి గారు, 88 వార్డ్ కార్పొరేటర్ మల్లు ముత్యాల నాయుడు గారు ఈ రెండు విద్యాసంస్థలు నరవ గ్రామంలో వెలిసేలాగా చొరవ తీసుకోవాలని జనసేన పార్టీ ద్వారా కోరుకుంటున్నాం, లేనియెడల ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకుని వెళ్లి, మా జనసేన పార్టీ నాయకులతో చర్చించి ప్రణాళిక రచించి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకుని వచ్చేలాగా రాబోయే రోజుల్లో కార్యచరణ జరుపుతామని చెప్పడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో స్థానిక నాయకులు బొడ్డు నాయుడు, చిన్న,అశోక్, చలం, శ్రీను, శ్యామ్, తేజ, శివ, జన సైనికులు మరియు ప్రజలు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com