Logo
Date of Publish : 29 December 2022, 2:58 pm
Editor : Sake Naresh

పెన్షన్ లబ్ధిదారులకు నోటీసులు ఇచ్చిన వైసీపీ ప్రభుత్వ వైఖరిపై జనసేన పార్టీ నిరసన

       పెందుర్తి ( జనస్వరం ) : వైఎస్ఆర్సిపి ప్రభుత్వం రాష్ట్రంలో 4 లక్షల మంది పేద ప్రజలు పెన్షన్ దారులకు నోటీసులు ఇవ్వడాన్ని జనసేన పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తు, బాధితుల తరఫున జోన్ 8 జీవీఎంసీ ఆఫీస్ వద్ద నిరసన చేశారు. అనంతరం సూపర్డెంట్ గారిని కలిసి బాధితుల తాలూకా సమస్యలు వివరించి లిఖితపూర్వకంగా వెంటనే వీరికి జనవరి నెలలో పెన్షన్ ఇవ్వాలని స్థానిక నాయకులు వీర మహిళ పిన్నటి పార్వతి గారి ఆధ్వర్యంలో వినత పత్రం ఇవ్వడం జరిగింది. మీడియా ప్రతినిధులతో పార్వతి మాట్లాడుతూ నోటీసులు తీసుకున్న పేద ప్రజలు గత కొన్ని సంవత్సరాల నుంచి పెన్షన్లు తీసుకుంటున్నారని వారు ఆప్పుడు ఏ గృహంలో ఉన్నారో ఇప్పుడు అదే గృహంలో ఉన్నారని మరి అలాంటప్పుడు మీకు పెన్షన్ తొలగించే హక్కు ఎవరు ఇచ్చారని, పేద ప్రజలను వృద్ధులను, దివ్యాంగులను ఈ విధంగా రోడ్డుమీద తీసుకొని రావడం ఎంతవరకు సమంజసం అని అన్నారు. సుపరిపాలన చేయమని అధికారం ఇస్తే చెత్త పాలన తో ప్రజలను ఇబ్బంది పెట్టడం వలన మీకు రాబోయే రోజుల్లో ఓటు రూపంలో ప్రజలు బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారని మాట్లాడడం జరిగింది. వబ్బిన జనార్థన శ్రీకాంత్ మాట్లాడుతూ అధికారం రాకముందు రోడ్లమీద తిరిగి ఈ యొక్క పేద ప్రజలను ముద్దులు పెట్టి ఈరోజు పెన్షన్లు తీసివేసి మొట్టికాయలు వేస్తున్నావని, రాజన్న పాలన చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చి ఈనాడు రాక్షకపాలన చేస్తున్నావని అన్నారు. మా యొక్క పెందుర్తి నియోజకవర్గం లో వేల సంఖ్యలో ప్రజలకు నోటీసులు అందాయని వారికి వచ్చే జనవరి నెలలో పెన్షన్ ఇవ్వలేని ఎడల స్థానిక ఎమ్మెల్యే అన్నపురెడ్డి అదీప్ రాజు గారు బాధ్యత వహించవలసిన అవసరం ఉందన్నారు. మా జనసేన పార్టీ ద్వారా బాధిత కుటుంబాలందరినీ ఏకం చేసి, జనసేన పార్టీ ఆధ్వర్యంలో మీ యొక్క ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నాము, స్థానిక నాయకులు జుత్తడా శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ పెన్షన్ 250 రూపాయలు పెంచడం కోసం ఈరోజు ముఖ్యమంత్రి గారు 4 లక్షల మంది పెన్షన్లకు నోటీసులు ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, మిమ్మల్ని ఎవరు పెంచమన్నారు ఎవరు తీయమన్నారు ? దీనికి మీరు బదులు ఇవ్వవలసిన అవసరం ఉందన్నారు. తప్పకుండా రాబోయే రోజుల్లో ప్రజలు తాలూకు వ్యతిరేకత మీకు తెలుస్తుంది అని మాట్లాడడం జరిగింది, నాయకులు శేఖర్ గారు మాట్లాడుతూ చిన్న చిన్న కారణాలతో పెన్షన్ దారులకు నోటీసులు ఇవ్వడం వల్ల వారు ఆందోళన చెందుతున్నారని, బాధితు కుటుంబాలకు జనసేన పార్టీ అండగా ఉంటుందని మాట్లాడింది, స్థానిక యువ నాయకుడు లక్కీ గోవింద్ మాట్లాడుతూ 94 వార్డ్ లో 240 పేద ప్రజలు నోటీసులు ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ఈ ముఖ్యమంత్రి 4 కోట్లతో పుట్టినరోజు చేసుకోవడానికి పేద ప్రజల పెన్షన్ను ఆపడం ఎంతవరకు సమంజసం అని, రాబోయే రోజుల్లో ప్రజలు మీకు బుద్ధి చెప్తారని మాట్లాడడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో స్థానిక నాయకులు మొటురు చైతన్య, శేఖర్, ప్రవీణ్, మరియు బాధిత ప్రజలు జనసైనికులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com